బాలీవుడ్ స్టార్ హీరో షారుఖ్ ఖాన్ కమర్షియల్ సినిమాలతో పాటు అప్పుడప్పుడు ప్రయోగాత్మక సినిమాల్లో కూడా నటిస్తుంటాడు. ఈ మధ్య కాలంలో ఆయన కెరీర్ బాగా దెబ్బతింది.

బాలీవుడ్ స్టార్ హీరో షారుఖ్ ఖాన్ కమర్షియల్ సినిమాలతో పాటు అప్పుడప్పుడు ప్రయోగాత్మక సినిమాల్లో కూడా నటిస్తుంటాడు. ఈ మధ్య కాలంలో ఆయన కెరీర్ బాగా దెబ్బతింది. సక్సెస్ లు రాక ఈ స్టార్ హీరో బాగా ఇబ్బంది పడుతున్నాడు.

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred

ఈ క్రమంలో 'జీరో' అనే ప్రయోగాత్మక చిత్రంలో నటించాడు. ఈ సినిమాలో షారుఖ్ మరుగుజ్జు పాత్రలో కనిపిస్తున్నాడని తెలియగానే సినిమాపై ఆసక్తి పెరిగిపోయింది. దేశవ్యాప్తంగా ఈ సినిమా శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సినిమా ట్రైలర్ ఆసక్తికరంగా ఉండడంతో సినిమా అంతకుమించి ఉంటుందని ఆశించిన ప్రేక్షకులకు నిరాశే ఎదురైందని అంటున్నారు. 

బాలీవుడ్ లో ఒకరోజు ముందే సినిమా స్పెషల్ షోలు వేయడంతో టాక్ బయటకి వచ్చేసింది. నేషనల్ మీడియా ఈ సినిమాకి ఇస్తోన్న రేటింగ్స్ చూస్తుంటే సినిమా ఇంత దారుణంగా ఉందా అని అనిపించకమానదు. నిజానికి ట్విట్టర్ లో కొంతమంది సినిమా బాగుందంటే మరికొందరు మాత్రం తిట్టిపోస్తున్నారు. కానీ ఎక్కువ శాతం ప్రేక్షకులను సినిమా ఆకట్టుకోలేకపోయింది. 

సాధారణంగా ఏ సినిమాకి పెద్దగా వంక పెట్టని బాలీవుడ్ సినీ విశ్లేషకుడు తరణ్ ఆదర్శ్ ఈ సినిమాకి రేటింగ్ 1 ఇచ్చాడు. వీఎఫ్ఎక్స్ బాగున్నప్పటికీ సినిమా బోరింగ్ గా ఉందని అంటున్నారు. షారుఖ్, అనుష్క, కత్రినాల నటన.. డాన్స్ బాగున్నా కథ,కథనాలు ఆసక్తికరంగా లేకపోవడం సినిమా తేలిపోయిందని టాక్.

Scroll to load tweet…

Scroll to load tweet…
Scroll to load tweet…