రాజమౌళిని అవమానించిన షారూఖ్ ఖాన్.. సినిమా చూసి కాల్ చేయాలంటూ పోస్ట్.. కంగుతిన్న ఫ్యాన్స్..
దర్శకధీరుడు రాజమౌళి.. `జవాన్` సినిమా చూసి ట్వీట్ చేశాడు. షారూఖ్‌ని, టీమ్‌ని అభినందించారు. కానీ దీనికి షారూఖ్ రియాక్ట్ అవుతూ చేసిన పోస్ట్.. జక్కన్నని అవమానించేలా ఉండటం హాట్ టాపిక్ అవుతుంది.

షారూఖ్ ఖాన్ హీరోగా నటించిన `జవాన్` చిత్రం బాక్సాఫీసు వద్ద సంచలనం సృష్టిస్తుంది. అట్లీ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో నయనతార, దీపికా పదుకొనె, ప్రియమణి, విజయ్ సేతుపతి వంటి వారు నటించారు. భారీ తారాగణంతో భారీ యాక్షన్ మూవీగా తెరకెక్కింది. కలెక్షన్ల దుమ్ములేపుతుంది. ఈ చిత్రం తొలి రోజు ప్రపంచ వ్యాప్తంగా ఏకంగా రూ.129.6కోట్లు వసూలు చేసింది. బాలీవుడ్‌లో అత్యధిక ఓపెనింగ్స్ రాబట్టిన తొలి చిత్రంగా నిలిచింది.
ఇదిలా ఉంటే ఈ సినిమాని దర్శకధీరుడు రాజమౌళి చూశారు. రిలీజ్ రోజే ఆయన సినిమా చూడటం విశేషం. అంతేకాదు బ్యాక్ టూ బ్యాక్ రెండు సినిమాలు చూశారట. `మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి`తోపాటు `జవాన్` చిత్రాన్ని చూసినట్టు తెలిపారు. ట్విట్టర్ ద్వారా ఈ విషయాన్ని తెలియజేస్తూ రెండు సినిమాలను అభినందించారు రాజమౌళి. ఇందుకు కదా షారూఖ్‌ని బాక్సాఫీసు బాద్షా అనేది. భూమి బద్దలయ్యే ఓపెనింగ్స్. ఉత్తరాదిలోనూ కూడా విజయ పరంపరని కొనసాగించినందుకు అట్లీకి అభినందనలు. `జవాన్` అద్భుతమైన విజయం సాధించినందుకు చిత్ర బృందానికి నా అభినందనలని తెలిపారు రాజమౌళి.
అయితే దీనిపై షారూఖ్ ఖాన్ స్పందించారు. రాజమౌళి ట్వీట్‌ని ట్యాగ్ చేస్తూ ఆయన ధన్యవాదాలు తెలిపారు. అయితే రాజమౌళి ట్వీట్‌ని సరిగా అర్థం చేసుకోకుండా షారూఖ్ ట్వీట్ ట్వీట్ చేయడం ఇప్పుడు ఆశ్చర్యపరుస్తుంది. దీంతో షారూఖ్ ట్వీట్ రాజమౌళిని అవమానించేలా ఉంది. ఇందులో షారూఖ్ చెబుతూ, థ్యాంక్యూ సర్, సినిమాకి మీరిస్తున్న క్రియేటివ్ ఇన్‌పుట్స్ నుంచి మేమంతా నేర్చుకుంటున్నామని తెలిపారు.
ఇక్కడి వరకు బాగానే ఉంది. కానీ మీకు వీలైనప్పుడు మా సినిమా చూడండి అంటూ ఆ పోస్ట్ చేయడం ఆశ్చర్యపరుస్తుంది. `మీకు కుదిరినప్పుడు సినిమా చూసి, ఆ తర్వాత నాకు కాల్ చేసి నేను మాస్ హీరోగా చేయగలిగానో లేదో చెప్పండి. హ హ.. ప్రేమతో మీకు ధన్యవాదాలు` అని పేర్కొన్నారు షారూఖ్. అయితే రాజమౌళి `జవాన్` సినిమాని చూసి ట్వీట్ చేసినట్టుగా షారూఖ్ అర్థం చేసుకోలేకపోయాడు. మొదటి ట్వీట్‌ని ఆయన గమనించలేదు. దీనికితోడు సినిమా గురించి రాజమౌళి ప్రస్తావించలేదు, బాక్సాఫీసు గురించి, అట్లీ గురించి చెప్పాడు. సినిమాని వివరిస్తూ ఆయన ట్వీట్ చేయలేదు.
దీంతో షారూఖ్.. రాజమౌళి `జవాన్` సినిమాని చూడకుండానే ట్వీట్ చేసినట్టుగా భావించి ఉంటాడు. అందుకే సినిమా చూసి ఫోన్ చేయండి అంటూ ట్వీట్‌లో పేర్కొన్నాడు. దీంతో ఇది రాజమౌళిని అవమానించేలా మారిపోయింది. షారూఖ్ ట్వీట్‌పై అభిమానులు హర్ట్ అవుతున్నారు. రాజమౌళి లాంటి దర్శకుడు సినిమా చూసి ట్వీట్ చేస్తే, ఆయన ట్వీట్ పూర్తిగా చూసుకోకుండా ఇలా తొందరపడితే ఎలా అని ప్రశ్నిస్తున్నారు. ఇది రాజమౌళికి అవమానమే అంటూ కామెంట్ చేస్తున్నారు. కాపీ పేస్ట్ లు చేస్తే ఇలానే ఉంటాయని సెటైర్లు పేలుస్తున్నారు.