Asianet News TeluguAsianet News Telugu

ముగ్గురు స్టార్లు.. 8 దేశాలు... షారుఖ్ ఖాన్ సినిమా సరికొత్త రికార్డ్, ఫ్యాన్స్ కు పండగే

సినిమాలకు కాస్త గ్యాప్ ఇచ్చిన షారుఖ్ ఖాన్.. ప్రస్తుతం దూకుడు మీద ఉన్నాడు. ఇదిగో అదిగో అంటూ.. ఫ్యాన్స్ ను ఊరిస్తూ.. ఇంకా లేట్ చేస్తున్న బాద్ షా.. కొత్త రికార్డ్ క్రియేట్ చేయడానికి రెడీగా ఉన్నాడు.

Shahrukh Khan Pathan Movie Shooting at 8 countries
Author
First Published Dec 4, 2022, 11:29 AM IST

రెండు మూడేళ్లు సినిమాలకు దూరంగా ఉన్న షారుఖ్ ఖాన్. రీ ఎంట్రీ ని గ్రాండ్ గా ప్లాన్ చేసుకున్నాడు. సాలిడ్ సినిమాతో ఫ్యాన్స్ కు ఫుల్ మీల్స్ పెట్టాలని చూస్తున్నాడు. సూపర్ కమ్ బ్యాక్ ఇవ్వాలని  ఉవ్విళ్ళూరుతున్నాడు. అందులో భాగంగా పఠాన్ మూవీని చేస్తున్న షారుఖ్ ఈసినిమాతో అందరి అటేన్షన్ తనవైపు తిప్పుకునే ప్లాన్ చేస్తున్నాడు. ఇందులో భాగంగా షారుఖ్‌ ఖాన్‌ నటిస్తున్న కొత్త సినిమా పఠాన్‌. 

యష్‌ రాజ్‌ ఫిలింస్‌ నిర్మిస్తున్న ఈసినిమాను సిద్ధార్థ్‌ ఆనంద్‌ డైరెక్ట్ చేస్తున్నాడు. బాలీవుడ్ స్టార్ హీరోయిన్  దీపికా పడుకోన్‌, జాన్‌ అబ్రహాం లాంటి స్టార్స్  కీలక పాత్రలు పోషిస్తున ఈసినిమాను ఎక్కడా కాంప్రమైజ్ అవ్వకుండా  భారీ స్థాయిలో తెరకెక్కిస్తున్నారు. ఇక ఈ సినిమా గురించి ఫ్యాన్స్ ఈగర్ గా వెయిట్ చేస్తుండగా.. పఠాన్ గురించి మరో ఇంట్రెస్టింగ్ అప్ డేట్ కొత్తగా వినిపిస్తుంది. సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 

ఈ సినిమాను 8 దేశాల్లో షూటింగ్ చేస్తున్నారు. 8 కంట్రీస్‌, 3 సూపర్‌ స్టార్స్‌, వన్‌ ఫిలిం.. అంటూ సోషల్‌ మీడియాలో ఈమూవీ టీమ్  యాక్షన్‌ స్టిల్స్‌ ను  షేర్‌ చేసింది. ఈ సినిమా యాక్షన్‌ సీక్వెన్సులు 8 దేశాల్లో షూటింగ్ చేస్తున్నారు. స్పెయిన్‌, యూఏఈ, టర్కీ, రష్యా, సెర్బియా, ఇటలీ, ఫ్రాన్స్‌, అఫ్గాన్‌ దేశాల్లో ఈ సినిమా షూటింగ్‌ జరుపుకోవడం విశేషం. ఇలా ఇంతవరకూ ఏ సినిమా షూటింగ్స్ జరగలేదు. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 

షారుఖ్‌ కెరీర్‌లో బిగ్గెస్ట్‌ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా గుర్తుండిపోయేలా ఈ సినిమాను ప్లాన్ చేస్తున్నారు టీమ్. ఇక ఈ సినిమా కోసం ఫారుఖ్ 57 ఏళ్ల వయస్సులో కూడా సిక్స్ ప్యాక్ చేసి.. యంగ్ హీరోలను మించి హ్యాండ్సమ్ గా కనిపిస్తున్నారు.  భారీ అంచనాల నడుమ పఠాన్ మూవీని హిందీతో పాటు తెలుగు, తమిళంలో వచ్చే ఏడాది జనవరి 25న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. 

2018లో రిలీజ్ అయిన జీరో  సినిమా తర్వాత బాలీవుడ్ బాద్ షా షారుఖ్ సిల్వర్ స్క్రీన్ పై కనిపించబోయే సినిమా ఇదే కావడంతో అంచనాలు భారీ స్థాయిలో పెరిగిపోయాయి. జీరో సినిమా డిజాస్టర్ అవ్వడంతో.. సాలిడ్ హిట్ తో కమ్ బ్యాక్ ఇవ్వాలని చూస్తున్నాడు షారుఖ్. ఈమూవీ హిట్ అవ్వడం షారుఖ్ కు చాలా ముఖ్యం. ఈ మూవీ తేడా వస్తే.. షారుఖ్ కెరీర్ పై అది చాలా ప్రభావం పడుతుంది.  ఇక షారుఖ్‌ ఖాతాలో ఈ సినిమాతో పాటు అట్లీ దర్శకత్వంలో నటిస్తున్న జవాన్‌, రాజ్‌ కుమార్‌ హిరాణీ రూపొందిస్తున్న డంకీ లాంటి మరికొన్ని సినిమాలున్నాయి. 

Follow Us:
Download App:
  • android
  • ios