లేట్ అయితేనేం లేటెస్ట్ గా రికార్డ్స్ క్రియేుట్ చేడానికి వచ్చేస్తున్నాడు బాలీవుడ్ బాద్ షా.. షారుఖ్ ఖాన్. దాదాపు ఐదేళ్లకు పైగా సినిమాలకు గ్యాప్ ఇచ్చిన ఆయన పఠాన్ సినిమాతో సందడి చేయబోతున్నాడు. ఈ మూవీ రిలీజ్ కు ముందే రికార్డ్స్ కు రెడీ అవుతోంది. 

లేట్ అయితేనేం లేటెస్ట్ గా రికార్డ్స్ క్రియేుట్ చేడానికి వచ్చేస్తున్నాడు బాలీవుడ్ బాద్ షా.. షారుఖ్ ఖాన్. దాదాపు ఐదేళ్లకు పైగా సినిమాలకు గ్యాప్ ఇచ్చిన ఆయన పఠాన్ సినిమాతో సందడి చేయబోతున్నాడు. ఈ మూవీ రిలీజ్ కు ముందే రికార్డ్స్ కు రెడీ అవుతోంది. 

చుటూ.. రకరకాల సమస్యలు, వరుస ఫెయిల్యూర్స్, కరోనా ఇలా రకరకాల కారణాల వల్ల బాలీవుడ్‌ అగ్రహీరో షారుఖ్‌ఖాన్‌ సిల్వర్ స్క్రీన్ కు 5ఏళ్లకు పైగా దూరం అయ్యాడు. ఇక ఆయన నటిస్తున్న తాజా సినిమా పఠాన్‌. వార్‌ ఫేమ్‌ సిద్ధార్థ్‌ ఆనంద్‌ దర్శకత్వం వహిస్తున్నారు. దీపికా పడుకోన్‌, జాన్‌ అబ్రహం ప్రధాన పాత్రల్ని పోషిస్తున్నారు. ఐదేళ్ల విరామం తర్వాత రాబోతున్న షారుఖ్‌ చిత్రంగా ‘పఠాన్‌’ అభిమానుల్లో అంచనాల్ని అమాంతం పెంచేస్తోంది. 
2023 జనవరి 25న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కాబోతోంది ఈ సినిమా. తాజాగా ఈ సినిమా డిజిటల్‌ హక్కులకు సంబంధించిన వార్తొకటి బాలీవుడ్‌ సర్కిల్స్‌లో వైరల్‌గా మారింది. ఈ సొనిమా డిజిటల్‌ హక్కులను అమెజాన్‌ ప్రైమ్‌ 200కోట్ల భారీ మొత్తానికి కొనేసిందన్న వార్త సోషల్ మీడియాలో గుప్పుమంది. అయితే ఈ విషయంపై మూవీ టీమ్ అనౌన్స్ మెంట్ ఇవ్వలేదు. 

అయితే మరో విశేషం ఏంటీ అంటే.. ఈ సినిమా నిర్మాణ సంస్థ యష్‌రాజ్‌ ఫిల్మ్స్‌ ఈ వార్తల్ని ఖండించలేదు. దాంతో డీల్‌ కుదరడం నిజమే అనేది బాలీవుడ్ సర్కిల్ టాక్. అదేగనుక నిజమైతే బాలీవుడ్‌ డిజిటల్‌ రైట్స్‌లో పఠాన్‌ కొత్త రికార్డు సృష్టించినట్లే. ప్రస్తుతం రాజ్‌కుమార్‌ హిరాణి రూపొందిస్తున్న డంకీ మూవీలో నటిస్తున్నారు షారుఖ్‌ఖాన్‌. వీరిద్దరి కాంబినేషన్‌లో ఫస్ట్ మూవీ ఇదే కావడం మరో విశేషం. 

ఏజ్ బార్ అవుతున్నా.. ఏమాత్రం కేజ్ తగ్గలేదు షారుఖ్ కు. అంతే కాదు ఏమాత్రం ఫిట్ నెస్ కూడా తగ్గలేదు. రీసెంట్ గా మరోసారి సిక్స్ ప్యాక్ చేసి సినిమాల పట్ల తన కమింట్ మెంట్ ను చాటుకున్నాడు షారుఖ్ ఖాన్. ఇక పఠాన్ లో షారుఖ్ ప్రాణ స్నేహితుడు, బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ కూడా గెస్ట్ రోల్ చేస్తున్నాడు.