సూపర్ ఫాస్ట్ గా జరుగుతుంది జవాన్ షూటింగ్. నాన్ స్టాట్ షెడ్యూల్స్ తో స్పీడ్ మీద ఉన్నాడు డైరెక్టర్ అట్లీ. అటు షారుఖ్-నయన్ కూడా  తగ్గేదేలేదన్నట్టు.. షూటింగ్ లో పాల్గొంటున్నారు. 

షారుఖ్ ఖాన్ హీరోగా నయనతార జంటగా .. కోలీవుడ్ యంగ్ డైరెక్టర్ అట్లీ బాలీవుడ్ ఎంట్రీ ఇస్తూ.. తెరకెక్కిస్తున్న సినిమా జవాన్. ఈసినిమా షూటింగ్ సూపర్ ఫాస్ట్ గా జరుగుతోంది. షారుఖ్ ఖాన్.. పఠాన్ సినిమాతో బాలీవుడ్ ప్లాప్ ల నుంచి బయట పడటంతో.. నెక్ట్స్ వచ్చే జవాన్ సినిమాపై అందరి దృష్టి ఉంది. ఈసినిమాతో ఇంకెన్ని రికార్డ్ ను షారుఖ్ ఖాన్‌ క్రియేట్ చేస్తాడా అని అంతా ఎదురు చూస్తున్నారు. జవాన్ సినిమాతో మరో రికార్డ్ కు రెడీ అవుతున్నారు టీమ్. ఇక ఈసినిమా షూటింగ్‌కు సంబంధించిన అప్‌డేట్‌ ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. 

నయనతారతో డ్యూయోట్ పాడుకుంటున్నాడు బాలీవుడ్ బాద్ షా. షారుఖ్‌, నయన్ కు సబంధించి డ్యూయోట్ షూటింగ్ సముద్రంలో జరుగుతుంది. భారీ షిప్ పై పై వీరి పాటకు సబంధించిన చిత్రీకరణ జరుగుతోంది. ఈ పాటను బాలీవుడ్ కొరియోగ్రఫర్ ఫరాఖాన్‌ కొరియోగ్రాఫీ చేస్తుండగా.. ఈసాంగ్ ను బాలీవుడ్ యంగ్ స్టార్ సింగర్ అర్జీత్ సింగ్ పాడాడు. ఈ షూటింగ్ కుసబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అట్లీ ఈ పాటను సినిమాకు హైలెట్‌గా నిలిచేపోయేలా ప్లాన్ చేశాడని సమాచారం.

Scroll to load tweet…

ఇక ఈసినిమాకు సంబంధించి చాలా విషయాలు నెట్టింట్లో హల్ చల్ చేస్తున్నాయి. తాజా సమాచారం ప్రకారం షారుఖ్‌ ఖాన్‌ ఈ సినిమాలో డ్యూయల్ రోల్ చేస్తున్నట్టు తెలుస్తోంది. తండ్రి, కొడుకుగా ద్విపాత్రాభినయంలో కనిపించనున్నాడట జవాన్. జవాన్‌లో న‌య‌న‌తార ఇన్వెస్టిగేటివ్ ఆఫీస‌ర్‌గా న‌టించ‌నున్నట్టు తెలుస్తోంది. కోలీవుడ్ స్టార్ హీరో విజయ్‌ సేతుపతి, ప్రియమణి, సన్యా మల్హోత్రా, సునీల్ గ్రోవర్‌ కీలక పాత్రలలో నటిస్తుండగా.. దీపికా పదుకొనే అతిథి పాత్రలో మెరవబోతుంది.

జవాన్ కు తమిళ యంగ్ స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్‌ రవిచందర్‌ మ్యూజిక్ చేస్తున్నాడు. హోంబ్యానర్‌ రెడ్ చిల్లీస్ బ్యాన‌ర్‌పై షారుఖ్ ఖాన్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈసినిమా చేస్తూనే షారుక్‌ ఖాన్‌ మరోవైపు సల్మాన్‌ ఖాన్‌ హీరోగా నటిస్తున్న టైగర్‌ 3లో గెస్ట్ రోలో చేస్తున్నాడు. మరోవైపు రాజ్‌ కుమార్ హిరానీ దర్శకత్వంలో డుంకీసినిమాలో కూడా నటిస్తున్నాడు షారుఖ్. ఈ సినిమాలో తాప్సీ పన్ను ఫీ మేల్‌ లీడ్ రోల్‌లో నటిస్తుండగా.. బొమన్ ఇరానీ కీలక పాత్ర పోషిస్తున్నాడు