బాలీవుడ్ స్టార్ కిడ్ సుహానా ఖాన్ బాలీవుడ్ ఎంట్రీకి సిద్దమైనట్లు సమాచారం. ప్రముఖ దర్శకుడితో చర్చలు కూడా పూర్తి కాగా లాంఛనమే తరువాయి అన్న మాట వినిపిస్తుంది. 


స్టార్ హీరోల కూతుళ్లు హీరోయిన్స్ గా ఎంట్రీ ఇవ్వడంతో బాలీవుడ్ లో చాలా కాలంగా ఉన్న ట్రెండ్. అనిల్ కపూర్ కూతురు సోనమ్ కపూర్, సైఫ్ అలీ ఖాన్ కూతురు సారా అలీ ఖాన్, నటుడు చుంకీ పాండే కూతురు అనన్య పాండే హీరోయిన్స్ గా మారారు. ఇక దర్శక నిర్మాతలు, నటుల వారసుల పేర్లు చెప్పాలంటే చాలానే ఉన్నాయి. పైన ఉదాహరించింది కేవలం ఈ జనరేషన్ కి చెందిన కొద్దిమంది మాత్రమే, ఈ లిస్ట్ లో చాలా మంది ఉన్నారు. ఇక టాలీవుడ్ లో ఇప్పుడిప్పుడే ఈ ట్రెండ్ మొదలవుతుంది. 

కాగా బాలీవుడ్ బాద్ షా షారుక్ ఖాన్(Shahrukh Khan) సుహానా ఖాన్ కూడా హీరోయిన్ గా ఎంట్రీ ఇవ్వనున్నారట. ప్రముఖ బాలీవుడ్ దర్శకుడు జోయా అక్తర్ ఈ యంగ్ బ్యూటీని లాంచ్ చేయనున్నారట. ఇటీవల సుహానా ఖాన్ దర్శకుడు జోయా అక్తర్ ఆఫీస్ కి వెళ్లారు. తన డెబ్యూ మూవీ కథా చర్చలలో భాగంగా జోయా అక్తర్ ని సుహానా కలిశారని ప్రచారం అవుతుంది. గతంలో షారుక్ తన కూతురు హీరోయిన్ కావాలనుకుంటుందని తెలియజేశారు. 

సుహానా ఖాన్ (Suhana Khan)నటిగా మొదటి అడుగు వేశారు. ది గ్రే పార్ట్ ఆఫ్ బ్లూ టైటిల్ తో తెరకెక్కిన ఇంగ్లీష్ షార్ట్ ఫిల్మ్ లో సుహానా ఖాన్ నటించారు. లండన్ యూనివర్సిటీలో చదువుకుంటున్న సుహానా ఫిల్మ్ మేకింగ్ కి సంబంధించిన కోర్సులు కూడా చేశారు. బాలీవుడ్ గ్రాండ్ ఎంట్రీకి ప్లాన్ చేసిన సుహానా వెండితెరను దున్నేయాలని డిసైడ్ అయ్యారు. 

ఇక 21ఏళ్ల సుహానా ఖాన్ తరచుగా వార్తలలో నిలుస్తూ ఉంటారు. ఆమె బికినీ ఫోటోలు సోషల్ మీడియాను షేక్ చేశాయి. విదేశాల్లో తన ఫ్రెండ్స్ తో విహారాలు, వినోదాలకు సంబంధించిన ఫోటోలు వైరల్ అవుతూ ఉంటాయి. షారుక్ ఖాన్, గౌరీ ఖాన్ ల కూతురు సుహానా పరిచయం అక్కర్లేని పేరు. సుహానా గ్లామరస్ ఫోటోలు తరచూ వైరల్ అవుతాయి. ఆమె అభిమానులు కూడా బాలీవుడ్ ఎంట్రీ కోసం ఎదురుచూస్తున్నారు.