నా పెళ్లి కూడా త్వరలోనే.. షారుఖ్ షాకింగ్ కామెంట్స్

shahrukh khan comments on priyanka chopra's marriage
Highlights

నాకు కూడా త్వరలోనే పెళ్లి కాబోతుంది. మీ అందరికీ తప్పకుండా వెడ్డింగ్ ఇన్విటేషన్ పంపిస్తాను. మెహందీ వేడుకతో పాటు రిసెప్షన్ కి కూడా మిమ్మల్ని ఆహ్వానిస్తాను. మీరు తప్పకుండా రావాలి

త్వరలోనే నేను పెళ్లి చేసుకోబోతున్నాను.. మీరందరూ తప్పకుండా రావాలి.. ముఖ్యంగా మెహందీ వేడుక, రిసెప్షన్ మిస్ కావద్దు అంటూ చెబుతున్నాడు బాలీవుడ్ బాడ్ షా షారుఖ్ ఖాన్. అదేంటి షారుఖ్ కి ఇది వరకే పెళ్లయింది కదా.. ముగ్గురు పిల్లలు కూడా ఉన్నారు ఇప్పుడు పెళ్లేంటి..? అనుకుంటున్నారా..? అక్కడికే వస్తున్నాం. అసలు విషయంలోకి వస్తే.. బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ప్రియాంక చోప్రా.. హాలీవుడ్ సింగర్ కమ్ యాక్టర్ నిక్ జోనాస్ ను వివాహం చేసుకోబోతుందంటూ వార్తలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే.

అయితే ఈ విషయాన్ని కన్ఫర్మ్ చేసుకోవడానికి బాలీవుడ్ మీడియా ఆమెకు సన్నిహితంగా ఉండే కొందరు తారలను కూడా ప్రశ్నిస్తోంది. ఈ క్రమంలో రీసెంట్ గా కంగనాను ప్రశ్నించగా.. తాజాగా షారుఖ్ ఖాన్ ను కూడా అడిగారు. షారుఖ్, ప్రియాంక మంచి స్నేహితులు. వీరిద్దరూ జంటగా కొన్ని సినిమాలు కూడా చేశారు. దీంతో ఆమె పెళ్లి గురించి షారుఖ్ కి తెలిసి ఉంటుందని అతడిని ప్రశ్నించగా.. దీనికి తనదైన స్టైల్ లో స్పందించాడు.

'ప్రియాంకకే కాదు నాకు కూడా త్వరలోనే పెళ్లి కాబోతుంది. మీ అందరికీ తప్పకుండా వెడ్డింగ్ ఇన్విటేషన్ పంపిస్తాను. మెహందీ వేడుకతో పాటు రిసెప్షన్ కి కూడా మిమ్మల్ని ఆహ్వానిస్తాను. మీరు తప్పకుండా రావాలి' అని సమాధానమిచ్చాడు. దీంతో అక్కడున్న వారంతా పగలబడి నవ్వారు. ప్రస్తుతం షారుఖ్ హీరోగా నటిస్తోన్న 'జీరో' ఈ ఏడాది డిశంబర్ లో ప్రేక్షకుల ముందుకు రానుంది.  

loader