ఇటీవల ఉడ్తా పంజాబ్ సినిమాతో సంచలనం సృష్టించిన షాహిద్ కపూర్ ప్రస్థుతం పద్మావతి రిలీజ్ కోసం ఎదురు చూస్తున్నాడు. ఇక తాజాగా ప్రపంచం మొత్తంమీద ఆసియాకు చెందిన అత్యంత శృంగార ఆసియా పురుషుడిగా బాలీవుడ్‌ నటుడు షాహిద్‌ కపూర్‌ నిలిచాడు. లండన్‌ కేంద్రంగా వెలువడే ఈస్ట్రన్‌-ఐ వారపత్రిక ఏటా నిర్వహించే ప్రతిష్ఠాత్మక ఆన్‌లైన్‌ పోల్‌ లో 2017కు అత్యధిక ఓట్లు షాహిద్‌కే వచ్చాయి.

 

గతేడాది ఈ ఖ్యాతిని బ్రిటీష్‌-పాకిస్థానీ గాయకుడు జైన్‌ మాలిక్‌కు దక్కింది. ఈ ఏడాది మాలిక్‌ను షాహిద్‌ వెనక్కి నెట్టేశాడు. రెండో స్థానంలో హృతిక్‌ రోషన్‌ నిలిచాడు. ఆరో స్థానంలో ఫావద్‌ ఖాన్‌, సల్మాన్‌ ఖాన్‌(7), గుర్మీత్‌ చౌదరి(8), రణ్‌వీర్‌ సింగ్‌(9), టీమిండియా సారధి విరాట్‌ కోహ్లీ(10) ఉన్నారు. ఈ జాబితాలో బాద్‌షా షారుక్‌ ఖాన్‌ ఇరవై స్థానంలో నిలిచాడు.

 

ప్రపంచవ్యాప్తంగా చరిత్ర సృష్టించిన బాహుబలి చిత్ర నటుడు ప్రభాస్‌కు కూడా ఈ జాబితాలో చోటు దక్కింది. 26 స్థానంలో ప్రభాస్‌ ఉన్నారు. టాప్‌ 50 సెక్సీయెస్ట్‌ ఆసియాన్‌ మెన్‌ జాబితాలో స్థానం సంపాదించుకున్న తెలుగు నటుడు ప్రభాస్‌ మాత్రమే. ఆన్‌లైన్‌ ఓటింగ్‌ ద్వారా మొత్తం 50 మంది అత్యంత శృంగార పురుషులను ఈస్ట్రన్‌-ఐ ఎంపిక చేసింది. గత వారం ప్రపంచంలోనే అత్యంత శృంగార ఆసియా మహిళగా వరుసగా ఐదోసారి ప్రియాంక చోప్రా నిలిచిన విషయం తెలిసిందే. కాగా ప్రతియేటిలా ఈ సారి కూడా... హృతిక్ రెండోస్థానంలో నిలిచాడు.