బాలీవుడ్ క్రేజీ హీరో షాహిద్ కపూర్ ఈ ఏడాది కబీర్ సింగ్ చిత్రంతో ఘనవిజయాన్ని సొంతం చేసుకున్నాడు. తెలుగు సంచలన చిత్రం అర్జున్ రెడ్డికి కబీర్ సింగ్ హిందీ రీమేక్ గా వచ్చింది. ఈ చిత్రంలో షాహిద్ కు జోడిగా కియారా అద్వానీ నటించింది. హిందీలో ఈ చిత్రం దాదాపు 200 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. 

తాజాగా షాహిద్ కపూర్ మరోసారి వార్తల్లో నిలిచాడు. షాహిద్ కపూర్, అతడి సతీమణి మీరా రాజ్ పుత్ కలసి ముంబైలోని ఓర్లి ప్రాంతంలో విలాసవంతమైన ఫ్లాట్ కొనుగోలు చేశాడు. ఈ ఫ్లాట్ ధర అక్షరాలా 56 కోట్లు. ఈ ప్లాట్ నుంచి సముద్రం అద్భుతంగా కనిపిస్తుంది. అత్యాధునిక సదుపాయాలతో ఈ ఫ్లాట్ ఉంటుంది. 

ఈ విలాసవంతమైన ఫ్లాట్ 8 వేల చదరపు అడుగులలో ఉంటుంది. ముంబైలో రియల్ ఎస్టేట్ ఊపుమీదున్న తరుణంలో షాహిద్, మీరా రాజ్ పుత్ జంట ఈ ఫ్లాట్ ని కొనుగోలు చేశారు. త్వరలో ఈ ఫ్లాట్ లోకి వీరి మారబోతున్నట్లు తెలుస్తోంది.