చిన్న సినిమాలు కూడా బాక్స్ ఆఫీస్ వద్ద సునామి సృష్టించగలవని నిరూపించిన సినిమాల్లో అర్జున్ రెడ్డి ఒకటి. ఒక్క రోజులోనే అర్జున్ రెడ్డి సినిమాతో చిత్ర యూనిట్ కెరీర్ మారిపోయింది. ముఖ్యంగా విజయ్ దేవరకొండకు వచ్చిన క్రేజ్. దానికి తోడు విజయ్ మరింత ఊపు వచ్చేలా తన మాటలతో బిహేవియర్ తో యూత్ కి బాగా దగ్గరయ్యాడు. 

ఆ సినిమాలో అతని నటనకు ప్రతి ఒక్కరు ఫిదా అయ్యారు. ఇకపోతే ఇతర భాషల్లో కూడా సినిమాను రీమేక్ చేస్తోన్న సంగతి తెలిసిందే. కోలీవుడ్ లో విక్రమ్ తనయుడు ధృవ్ వర్మ పేరుతో రీమేక్ చేస్తుండగా టీజర్ ను ఇటీవల రిలీజ్ చేశారు. అయితే టీజర్ కు పెద్దగా స్పందన రాలేదు. 

విజయ్ దేవరకొండ నటన ముందు కనీసం పావు వంతు నటన కూడా సరి తూగలేదని కామెంట్ చేశారు. ఇకపోతే బాలీవుడ్ షాహిద్ కపూర్ కబీర్ సింగ్ పేరుతో రాబోతున్నాడు. అతని లుక్స్ దాదాపు అర్జున్ రెడ్డిలానే ఉన్నాయి. రీసెంట్ గా ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో విజయ్ స్థాయిలో ఈ కథలో ఎవరు నటించలేరని ఓపెన్ గా చెప్పేశాడు. 

అదే విధంగా కబీర్ సింగ్ యూనిట్ కు విజయ్ సోషల్ మీడియా ద్వారా విషెస్ అందించగా షాహిద్ రిప్లై ఇచ్చాడు. ఎవరు ఎంత కష్టపడినా ఎన్ని రకాలుగా చేసినా ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా అతనిలా చేయలేరని చెప్పేశాడు. దీంతో అర్జున్ రెడ్డి హవా మరికాస్త పెరిగిందని చెప్పవచ్చు. మరి కబీర్ సింగ్ ఎంతవరకు తన పాత్రకు న్యాయం చేస్తాడో చూడాలి.