Asianet News TeluguAsianet News Telugu

Jawan Collections : ‘జవాన్’ బీభత్సం.. మూడో రోజు పెరిగిన కలెక్షన్స్.. మొత్తం వసూళ్లు ఎంతంటే?

షారుఖ్ ఖాన్ ‘జవాన్’ బాక్సాఫీస్ దుమ్ముదులుపుతోంది. రోజుకు వంద కోట్లకు పైగా కలెక్షన్లు రాబడుతూ సెన్సేషన క్రియేట్ చేస్తోంది. మొదటిరోజు వసూళ్లు హిస్టారిక్ గా స్టార్ట్ అయ్యి.. మరింతగా పెరుగుతున్నాయి. మూడ్రోజుల్లో ఎన్ని కోట్లు కలెక్ట్ చేసిందంటే... 
 

Shah Rukh Khans Jawan movie Day3 Collections world wide NSK
Author
First Published Sep 10, 2023, 6:20 PM IST | Last Updated Sep 10, 2023, 6:23 PM IST

బాలీవుడ్ సూపర్ స్టార్, షారుఖ్ ఖాన్ (Shah Rukh Khan)  బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులు క్రియేట్ చేస్తున్నారు. భారీ యాక్షన్ చిత్రాల్లో నటిస్తున్న బాలీవుడ్ బాద్షా సరైన సమయంలో థియేటర్లలో దిగుతూ బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపిస్తున్నారు. ఇప్పటికే ‘పఠాన్’తో రూ.1000 కోట్లకు పైగా వసూళ్లు సాధించి సత్తా చాటిన విషయం తెలిసిందే. ఇక తర్వాతి చిత్రం ‘జవాన్’(Jawan) తో ఇప్పుడు అదరగొడుతున్నారు. మూడు రోజుల (సెప్టెంబర్ 7న) కింద ప్రపంచ వ్యాప్తంగా ఈ చిత్రం విడుదలైన విషయం తెలిసిందే. 

ప్రస్తుతం ఈ చిత్రానికి ఎలాంటి పోటీలేదు. పైగా ‘జవాన్’కు ఆడియెన్స్ నుంచి పాజిటివ్ రెస్పాన్స్ దక్కింది. దీంతో బాక్సాఫీస్ కలెక్షన్లు అదిరిపోతున్నాయి. తొలిరోజే రూ.127 కోట్లు వసూళ్లు చేసి హిందీ సినిమా చరిత్రలోనే ఫస్ట్ డే హ్యాయెస్ట్ గ్రాస్ కలెక్ట్ చేసిన చిత్రంగా రికార్డు క్రియేట్ చేసింది. రెండో రోజు కూడా రూ.100 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టి రూ.240 కోట్లకు చేరుకుంది. ఇక తాజాగా మూడో రోజు కలెక్షన్ల మొత్తాన్ని మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. 

మూడో రోజు ‘జవాన్’ కలెక్షన్లు ప్రపంచ వ్యాప్తంగా ఏకంగా రూ.384.69 కోట్లు చేరుకున్నట్టు మేకర్స్ అఫీషియల్ గా ప్రకటించారు. ఇక రెండ్రోజులతో పోల్చితే మూడోరోజు వసూళ్లు మరింతగా పెరిగాయి. థర్డ్ డే రూ.140 కోట్లకు పైగా రావడం విశేషం. అయితే వీకెండ్ కావడంతో కలెక్షన్లు పెరిగాయని ట్రేడ్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఈ లెక్కన ఆదివారం వసూళ్లతో జవాన్ రూ.500 కోట్లు రీచ్ అవ్వడం సులభమనే అంటున్నారు. ముఖ్యంగా ‘జవాన్’ హిందీ బెల్డ్ లో రూ.180 కోట్ల వరకు కలెక్ట్ చేసి సత్తా చాటుకుంది. తమిళం, తెలుగులోనూ మంచి వసూళ్లను సొంతం చేసుకుంటోంది. 

తమిళ స్టార్ డైరెక్టర్ అట్లీ (Atlee) దర్శకత్వంలో వచ్చిన ఈ యాక్షన్ ఫిల్మ్ లో లైడీ సూపర్ స్టార్ నయనతార (Nayanthara)  కథనాయికగా నటించింది. ఈ మూవీతోనే బాలీవుడ్ లోకీ ఎంట్రీ ఇచ్చింది. ఇక తమిళ స్టార్, మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి విలన్ పాత్ర పోషించారు. దీపికా పదుకొణె గెస్ట్ రోల్ చేయడం విశేషం. అనిరుధ్ అదిరిపోయే మ్యూజిక్ ఇచ్చారు. రెడ్ చిల్లీస్ బ్యానర్ పై షారుఖ్ భార్య గౌరీ ఖాన్ నిర్మించిన విషయం తెలిసిందే. 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios