Asianet News TeluguAsianet News Telugu

షారుఖ్ ఖాన్ బిగ్గెస్ట్ ఫ్యాన్.. వీల్ చైర్ లో వచ్చి ‘జవాన్’ చూసిన అభిమాని.. వైరల్ వీడియో..

బాలీవుడ్ బాద్షా, షారుఖ్ ఖాన్ వీరాభిమాని వీడియో ఒకటి నెట్టింట వైరల్ గా మారింది. లేవలేని స్థితిలో వీల్ చైల్ లో థియేటర్ కు వచ్చి ‘జవాన్’ చూశారు. కింగ్ ఖాన్ పై చాటుకున్న అభిమానానికి నెటిజన్లు ఫిదా అవుతున్నారు. 
 

Shah Rukh Khans biggest fan watched in Jawan Movie in Theatre on Ventilator NSK
Author
First Published Sep 16, 2023, 5:30 PM IST | Last Updated Sep 16, 2023, 5:30 PM IST

కింగ్ ఖాన్, బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ (Shah Rukh Khan)  ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ప్రపంచ వ్యాప్తంగా షారుఖ్ కు అభిమానులు ఉంటారు. ఆయన సినిమాల కోసం ఎంతగానో ఎదురుచూస్తుంటారు. ‘పఠాన్’తో భారీ సక్సెస్ అందుకున్న తర్వాత ప్రస్తుతం ‘జవాన్’తో షారుక్ బాక్సాఫీస్ వద్ద దుమ్ములేపుతున్నారు. దీంతో ఆయన అభిమానులు థియేటర్లలో చేసే సందడి  మాములుగా లేదు. ఈ క్రమంలో నెట్టింట ఓ హార్ట్ టచ్చింగ్ వీడియో వైరల్ గా మారింది. 

అనారోగ్యంగా ఉన్న షారుఖ్ ఖాన్ బిగ్గెస్ట్ ఫ్యాన్ ఒకరు Jawan Movie చూసేందుకు థియేటర్ కు వచ్చారు. వీల్ చైర్ లో లేవలేని స్థితిలో ఉండటంతో పాటు లైఫ్ సపోర్ట్ మెషీన్ తో సినిమా వీక్షించేందుకు వచ్చారు. ప్రాణాలతో పోరాడుతున్నా.. మూవీ చూసి షారుఖ్ ఖాన్ పై ఆయనకున్న అభిమానాన్ని చాటుకోవడం పట్ల అభిమానులు ఖుషీ అవుతున్నారు. నెటిజన్లు సైతం షారుఖ్ పై చూపించిన ప్రేమకు ఫిదా అవుతున్నారు. కామెంట్లతో అభినందిస్తున్నారు. మొత్తానికి ఈ హృదయాన్ని కదిలించే వీడియో నెట్టింట చక్కర్లు కొడుతోంది. 

ఇదిలా ఉంటే.. రీసెంట్ గా హాస్పట్ లో పేషంట్ డ్రెస్ లో ఉన్న ఓ మహిళ కూడా ‘జవాన్’లోని చలెయా సాంగ్ కు స్టెప్పులేస్తూ సందడి చేసింది. షారుఖ్ పై ఉన్న అభిమానాన్ని చాటుకుంది. ఈ ఘటనలతో బాలీవుడ్ బాద్షాకు డైహార్ట్ ఫ్యాన్స్  ఉంటారని మరోసారి రుజువైంది. ఇక ‘జవాన్’ చిత్రం నేటితో పదిరోజులు పూర్తి చేసింది. బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపిస్తోంది. ఇప్పటి వరకు ప్రపంచ వ్యాప్తంగా రూ.760 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది.

భారీ తారాగణం, అబ్బురపరిచే యాక్షన్ సీక్వెన్స్ లు ఉండటంతో ‘జవాన్’ వరల్డ్ వైడ్ గా ఆడియెన్స్ ను ఫిదా చేస్తోంది.  చిత్రంలో షారుఖ్ ఖాన్ డ్యుయెల్ రోల్ చేశారు. లేడీ సూపర్ స్టార్ నయనతారా (Nayanthara) బాలీవుడ్ కు ఎంట్రీ ఇస్తూ షారుఖ్ సరసన నటించింది. విజయ్ సేతుపతి విలన్ గా మెప్పించారు.  అట్లీ దర్శకత్వం వహించగా.. అనిరుధ్ సంగీతం అందించారు. రెడ్ చిల్లీస్ బ్యానర్ పై షారుఖ్ ఖాన్ భార్య గౌరీ ఖాన్ నిర్మించారు. రీసెంట్ గానే ‘జవాన్’ సక్సెస్ సెలబ్రేషన్స్ నూ గ్రాండ్ గా నిర్వహించారు. 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Rohit Gupta (@ro_hit_hain)

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios