ఈమధ్య స్టార్ హీరోలు ఏ వస్తువు వాడినా.. అది వైరల్ అవుతుంది. వాచే కదా,,చెప్పులేకదా అనుకుంటాము.. కాని వాటి కాస్ట్ లక్షల్లో.. కోట్లలో ఉంటే కళ్లు తిరగాల్సిందే. ప్రస్తుతం షారుఖ్ ఖాన్... వాచ్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ న్యూస్ అవుతుంది. 

సాధారణంగా ఫిల్మ్ స్టార్ చాలా కాస్ట్లీ వస్తువలు వాడుతుంటారు. వారు వాడే చిన్న చిన్న వస్తువులే.. కోట్లలో కాస్ట్ ఉంటాయి. వాటిపై ఫ్యాన్స్ ఎప్పటికప్పుడు ఇంట్రెస్ట్ చూపిస్తుంటారు. తమ అభిమాన స్టార్ ఏ వస్తువు వాడుతున్నాడో తెలుసుకుని వాటిని వైరల్ చేస్తుంటారు. ముఖ్యంగా బాలీవుడ్ హీరోలు వాడే కాస్ట్లీ వస్తువులు..ఎప్పటి కప్పుడు వైరల్ అవుతూనే ఉంటాయి. 

బాలీవడు లో స్టార్ హీరోల స్టైల్.. వారు వాడే వస్తువుల కాస్ట్ ఎప్పటికప్పుడు సెన్సేషన్ అవుతున్నాయి. ఈక్రమంలో షారుఖ్ ఖాన్ వాడుతున్న వాచ్ ఇప్పుడు హాట్ టాపిక్ అవుతుంది. పఠాన్ సినిమాతో సెన్సేషన్ క్రియేట్ చేశాడు షారుఖ్ ఖాన్. దాదాపు ఏడేళ్ల తరువాత బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు. ఈ సక్సెస్ తో మంచి జోరుమీద ఉన్నాడు షారుఖ్. బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్‌ తాజాగా ఓ ఈవెంట్‌లో కనిపించి సందడి చేశాడు. ఈ ఈవెంట్ లో ఆయన స్టైల్ పైనే చర్చ జరుగుతోంది. 

అందుకు కారణం షారుఖ్ ఖాన్ పెట్టుకున్న వాచీనే. ఆ వాచ్ లో ఏమంత స్పెషల్ అని అనుకుంటున్నారు కదూ.. ఇండియాలో ఇప్పటి వరకూ ఏ స్టార్ హీరో కూడా పెట్టుకోనంత కాస్ట్లీ వాచ్ ను షారుఖ్ వాడుతున్నారు అదే స్పెషల్. ఈ ఈవెంట్ లో బ్లాక్ సూట్‌లో దర్శనమిచ్చిన షారుఖ్.. చేతికి బ్లూ కలర్ రిస్ట్ వాచ్ పెట్టుకున్నారు. ఆ వాచీ ఖరీదు ఎంతో తెలిస్తే కళ్లు తిరగడం ఖాయం. ఆ వాచీ విలువ తో కొన్ని కుటుంబాలు కొన్ని ఏళ్లపాటు జీవించవచ్చు..ఇతకీ ఆ వాచ్ కాస్ట్ ఎంతంటే అక్షరాలా 45 కోట్ల 98 లక్షలు.. అంటే దగ్గరగా 5 కోట్లు. ఈ విషయం తెలిసి అంతా ఔరా అంటున్నారు.

Scroll to load tweet…

పఠాన్ సినిమాలో షారుఖ్ జోడీగా దీపికా పదుకొణే నటించింది. ఈస్టార్ హీరోయిన్ ట్విట్టర్‌లో ఈ వీడియోను షేర్ చేసింది. ఈ వీడియోలో షారుఖ్ ఈ వాచీతో కనిపించాడు. ఇద్దరూ ముస్తాబవుతున్నట్టు ఉన్న ఆ వీడియో పఠాన్ ఈవెంట్ కు ముందు తీసినట్టు కనిపిస్తోంది. ఈ ఈవాచ్ ను షారుఖ్ ఫ్యాన్స్ తెగ వైరల్ చేస్తున్నారు. అయితే ఇంతకీ ఆ వాచ్ ఏ కంపెనీది అంటే అడెమర్స్ పిగెట్‌ అనే స్విట్జర్లాండ్‌కు చెందిన లగ్జరీ వాచ్ తయారీ కంపెనీకి చెందినదని తెలుస్తోంది. ఇది ఆ కంపెనీ రాయల్ ఓక్ పెర్‌పెచ్యుయల్ క్యాలెండర్ వాచీ అని తెలిసింది.