Asianet News TeluguAsianet News Telugu

షారుఖ్ ఖాన్ కు అవమానం, నెటిజన్ విమర్షలకు బాద్ షా స్ట్రాంగ్ కౌంటర్,

బాలీవుడ్ బాద్ షా.. షారుఖ్ ఖాన్ కు ..నెటిజన్లకు అస్సలు పడటం లేదు. ఆయన ఎప్పుడు చాట్ లోకి వచ్చినా.. చిరాకు పెడుతూ.. ప్రశ్నలు వేస్తున్నారు. షారుక్ కూడా అంతే ఘాటుగా స్పందిస్తున్నారు.
 

Shah Rukh Khan Strong Counter To netizens Who Says Jawan And Pathan Are Bad Films JMS
Author
First Published Dec 7, 2023, 11:20 AM IST

బాలీవుడ్  కు రెండు సూపర్ హిట్లతో ప్రాణం పోశారు షారుఖ్ ఖాన్. రెండు సినిమాలు రెండు  వేల కోట్లతో ..బాలీవుడ్ కు ఊపిరిపోశాడు. ఈ స్టార్ హీరో నటించిన జవాన్, పఠాన్ సినిమాలు ప్రపంచ వ్యాప్తంగా బాక్సాఫీస్ వద్ద చెరో వెయ్యి కోట్ల రూపాయలకు పైగా వసూలు చేశాయి. దాంతో బాద్ షా ఇమేజ్ అమాంతం పెరిగిపోయింది. ఇక ఈసినిమాల కలెక్షన్స్ పై కూడా రకరకాల కామెంట్లు వచ్చాయి. అంతే కాదు ఫేక్ కలెక్షన్స్ అన్న రూయర్లు కూడా వచ్చాయి. 

ఇది ఇలా ఉంటే.. షారుఖ్ ఖాన్ సోషల్ మీడియాలో ఫుల్ యాక్టీవ్ గా ఉంరు. ఆయన తన ఫ్యాన్స్ తో చిట్ చాట్ లు చేస్తూ ఉంటారు. ఈమధ్య షారుఖ్ ఖు నెటిజన్లకు పెద్దగా పడటం లేదు. ఎప్పుడూ ఏదో ఒక ఇష్యూ వీరిమధ్య జరగుతూనే ఉంది. నెటిజన్లు ఏదో ఒకటి అనడం.. షారుఖ్ కోపంతో ఊగిపోతూ..  కౌంటర్లు వేయడం జరుగుతూ ఉన్నాయి.  అయితే తాజాగా మరోసారి ఈసీన్ రిపిట్ అయ్యింది ఐతే తాజా చాట్లో  ఈ సినిమాల గురించి ఓ నెటిజన్ దారుణంగా మాట్లాడాడు. దానికి షారూఖ్ కూడా అంతే  ఘాటుగా సమాధానం ఇచ్చాడు. 


సోషల్ మీడియాలో షారుఖ్ ఖాన్ అభిమానులతో చిట్ చాట్ చేస్తూ ఉంటారు.. ఎప్పటికప్పుడు .. ఆస్క్ ఎస్ఆర్ కె  అంటూ అభిమానులతో ముచ్చటిస్తూ ఉంటాడు. షారుఖ్ ఖాన్ నటించిన డంకీ ట్రైలర్‌ రీసెంట్ గా  రిలీజ్ అయ్యింది. ఈ ట్రైలర్ కు మంచి స్పందన కూడా  వచ్చింది. అలాగే ఆయన కూతురు సుహానా ఖాన్ మొదటి సినిమా ది ఆర్చీస్ నేరుగా నెట్‌ఫ్లిక్స్‌లో విడుదలైంది. ఈ సందర్భంగా అభిమానులతో షారుక్‌ ఆస్క్ SRK నిర్వహించారు. అయితే ఈ అవకాశాన్ని కొందరు దుర్వినియోగం చేసుకున్నారు. షారుఖ్‌ను ట్రోల్ చేస్తున్నారు. 

మీ చెత్త సినిమాలు జవాన్ , పఠాన్ పబ్లిసిటీ కారణంగా విజయవంతమయ్యాయి. అదే పబ్లిసిటీతో డుంకీ సినిమా కూడా సూపర్ హిట్ అవుతుందంటే నమ్ముతారా.? అని ఓ నెటిజన్ ప్రశ్నించాడు. షారుఖ్ ఖాన్ ప్రశ్నను పట్టించుకోకుండా మిగిలిన నెటిజన్స్ కు రిప్లే ఇస్తూ వచ్చాడు.. కానీ అతను అదే ప్రశ్నను తిరిగి మళ్లీ అడిగాడు. దానికి షారుక్ ఖాన్ స్పందిస్తూ.. సాధారణంగా నేను మీలాంటి సూపర్ స్మార్ట్ వ్యక్తులకు సమాధానం చెప్పను. కానీ నేను మీకు సమాధానం ఇస్తాను. ఎందుకంటే మలబద్ధకం సమస్యకు చికిత్స అవసరమని మీరు అనుకుంటున్నారు. నా ప్రచార బృందానికి చెప్పి నేను మీకు మందులు పంపుతాను. మీరు త్వరగా కోలుకుంటారని ఆశిస్తున్నాను’ అని షారుక్ ఖాన్ పోస్ట్ చేశాడు.

గతంలో కూడా ఇలా షారుఖ్ చిట్ చాట్ లో పిచ్చి ప్రశ్నలతో షారుఖ్ ను ఇబ్బంది పెట్టే ప్రయత్నంచేశారు కొంత మంది నెటిజన్లు. నయనతారకు పడిపోయారా అని అప్పట్లో ఓ వ్యక్తి ప్రశ్నించగా.. తనకు పెల్ళైపోయిందని.. పిచ్చి ప్రశ్నలు వేయొద్దంటు ఘాటుగా జవాబు ఇచ్చాడు షారుఖ్. ఇలా ఏదో ఒక రకంగా బాలీవుడ్ హీరోపై ట్రోల్స్ చేస్తున్నారు జనాలు. ఇక డంకీ సినిమా విషయానికి వస్తే.. ఈమూవీని  రాజ్‌కుమార్ హిరానీ  డైరెక్ట్ చేస్తున్నారు. షారూఖ్‌తో పాటు తాప్సీ పన్ను, విక్కీ కౌశల్ ఈసినిమాలో నటించారు. డిసెంబర్ 21న డంకీ ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ కాబోతోంది. 

Follow Us:
Download App:
  • android
  • ios