షారుక్‌ నటించిన ‘జీరో’ మొన్న శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ చిత్రంపై జనాల్లో మంచి అంచనాలు ఏర్పడ్డాయి. కానీ కలెక్షన్ల పరంగా మాత్రం బాగా వెనకబడిపోయింది.  ‘జీరో’ చిత్రం భారత్‌లో 4380 తెరలపై విడుదలై శుక్రవారం రూ.20.14 కోట్లు రాబట్టింది.  కానీ ‘జీరో’ రెండో రోజు డీలాపడిపోయింది. తొలిరోజు కలెక్షన్లతో పోలిస్తే రెండో రోజు వసూళ్లు 15 శాతానికి పడిపోయాయి.

శనివారం ‘జీరో’ కేవలం రూ.17 కోట్లు రాబట్టింది. ముందస్తు బుకింగ్స్‌ వల్ల తొలిరోజు వసూళ్లు బాగున్నాయని సినీ ఎనాలసిస్ట్ లు  చెబుతున్నారు. ఇప్పటికే వచ్చిన నెగిటివ్ రివ్యూలు, సినిమా టాక్‌ కారణంగా రోజురోజుకీ కలెక్షన్లు తగ్గే అవకాశం ఉందని అంటున్నారు.  ఈ నేపధ్యంలో ఈ చిత్రాన్ని ఆరు నిముషాలు ట్రిమ్ చేసారు. ఈ విషయం అఫీషియల్ గా ప్రకటించకుండా కేవలం డిస్ట్రిబ్యూటర్స్, ఎగ్జిబిటర్స్ కు మాత్రమే తెలియచేసారు.

నిజానికి షారుక్ ఖాన్ కి కొంతకాలంగా సరైన హిట్ లేదు. దాంతో ఆయన అభిమానులంతా సాధ్యమైనంత త్వరగా ఆయనకి ఒక బ్లాక్ బస్టర్ హిట్ పడాలని భావిస్తున్నారు. షారుక్ ఖాన్ కూడా అదే ఉద్దేశంతో ప్రయోగాత్మక చిత్రంగా 'జీరో'ను నిర్మించాడు. భారీ బడ్జెట్ తో నిర్మితమైన ఈ సినిమాలో షారుక్ మరుగుజ్జుగా కనిపిస్తాడు. అనుష్క శర్మ .. కత్రినా కైఫ్ హీరోయిన్స్ గా నటించారు. క్రిస్మస్ రోజున ఈ సినిమా వసూళ్లు భారీగా పెరిగే ఛాన్స్ ఉందనే టాక్ వినిపిస్తోంది