రామ్ చరణ్ పై  ఇంట్రెస్టింగ్ పోస్ట్ పెట్టారు షారుఖ్ ఖాన్. పఠాన్ ట్రైలర్ రిలీజ్ చేసిన రామ్ చరణ్ పోస్ట్ కు రిప్లై ఇస్తూ.. షారుఖ్ అన్న మాటలు వైరల్ అవుతున్నాయి. 

ఈరోజు పఠాన్ తెలుగు ట్రైలర్ ను రిలీజ్ చేశారు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్. తన ట్విట్టర్ పేజ్ ద్వారా ట్రైలర్ రిలీజ్ చేసిన చరణ్.. పఠాన్ టీమ్ కు శుభాకాంక్షలు తెలపడంతో పనాటు.. షారుఖ్ ఖాన్ గురించి గోప్పగా రాశారు. పఠాన్‌ టీంకు ఆల్‌ ది బెస్ట్‌ చెప్పిన చరణ్ బాబు.. ఈ విధంగా అన్నారు. షారుఖ్‌ సార్‌ మిమ్మల్ని ఇదివరకెన్నడూ చూడని యాక్షన్‌ అవతార్‌లో చూడటానికి ఆత్రుతతో ఎదురు చూస్తున్నానంటూ.. రామ్ చరణ్ ట్వీట్ చేశాడు. 

Scroll to load tweet…

ఇక ఈ పోస్ట్ కు రిప్లై ఇచ్చాడు బాలీవుడ్ బాద్ షా... షారుఖ్ ఖాన్. చరణ్ కు థ్యాంక్స్ చెపుతూ.. ఇంట్రెస్టింగ్ పోస్ట్ పెట్టాడు. షారుఖ్ ఈ విధంగా అన్నారు... ధన్యవాదాలు మెగాపవర్ స్టార్‌... మీరు ఆర్‌ఆర్‌ఆర్‌ కోసం ఆస్కార్‌ అవార్డు సాధించి భారత్‌కు తీసుకొచ్చిన తర్వాత దానిని టచ్‌ చేసే అవకాశం తనకు ఇవ్వాలని రీట్వీట్ చేశాడు షారుఖ్‌ ఖాన్‌. ఈ ట్వీట్ ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 

Scroll to load tweet…

పఠాన్ 2023 జనవరి 25న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో గ్రాండ్‌గా రిలీజ్ కాబోతోంది మూవీ. బాలీవుడ్ స్టార్ హీరో షారుఖ్ ఖాన్ నటించిన యాక్షన్ థ్రిల్లర్ ఫిల్మ్ పఠాన్. సిద్ధార్థ్ ఆనంద్ డైరెక్ట్ చేసిన ఈ సినిమాలో షారుఖ్ జోడీగా దీపికా పదుకొణె నటించగా.. ఇతర ఇంపార్టెంట్ పాత్రల్లో జాన్ అబ్రహం నటించారు. యష్ రాజ్ ఫిల్మ్స్ బ్యానర్ పై ఆదిత్య చోప్రా నిర్మిస్తున్నారు. రిలీజ్ టైమ్ దగ్గరపడుతుండటంతో.. మూవీ టీమ్ ప్రమోషన్స్ కు పదును పెట్టారు. ఈక్రమంలోనే మూవీ టీమ్ ట్రైలర్ రిలీజ్ ను ప్లాన్ చేశారు. హిందీలో తెరకెక్కిన ఈసినిమాను తెలుగు, తమిళంలోనూ రిలీజ్ చేయబోతున్నారు. కాగా, ట్రైలర్ ను కూడా ఆయా భాషల్లోరిలీజ్ చేశారు. దీపికా-షారుఖ్‌ ఖాన్‌ కాంబినేషన్‌లో వస్తున్న మూడో సినిమా కావడంతో పఠాన్‌పై అంచనాలు భారీగానే ఉన్నాయి.

అటు ఆర్ఆర్ఆర్ సినిమాతో ఆస్కార్ సాధించడానికి రెడీగా ఉన్నాడు రామ్ చరణ్. ఈమూవీకి ఆస్కార్ పక్కా అంటూ.. హాలీవుడ్ నుంచి కూడా కొందరు స్పందిస్తున్నారు. ప్రస్తుతం రామ్ చరణ్ శంకర్ డైరెక్షన్ లో సినిమా చేస్తున్నాడు. ఈమూవీ సూపర్ ఫాస్ట్ గా షూటింగ్ చేసుకుంటుంది. దాదాపు షూటింగ్ ఎండింగ్ లో ఉంది. త్వారలో షూటింగ్ కు గుమ్మడి కాయ కొట్టి పోస్ట్ ప్రొడక్షన్ కు వెళ్లబోతున్నారు టీమ్.