Asianet News TeluguAsianet News Telugu

'పఠాన్' ఓటిటి రిలీజ్ డేట్, ప్లాట్ ఫామ్

భారీ అంచనాల మధ్య, బాలీవుడ్ బిగ్గీ పఠాన్ మొన్న బుధవారం థియేటర్ల లో విడుదల అయ్యింది. సిద్దార్థ్ ఆనంద్ దర్శకత్వం వహించిన ఈ స్పై యాక్షన్ థ్రిల్లర్ ద్వారా కింగ్ ఖాన్ షారుక్ మరోసారి తన సత్తా చాటాడు. 

Shah Rukh Khan Pathaan OTT release date: When and where to watch
Author
First Published Jan 28, 2023, 4:46 PM IST

 'పఠాన్'  ఫీవర్‌తో బాలీవుడ్‌ ఊగిపోతున్న సంగతి తెలిసిందే. మొదటి రోజే హిట్‌ టాక్‌ తెచ్చుకున్న బాద్‌షా షారూఖ్ ఖాన్ సినిమాకు వసూళ్ల సునామీ సాగుతుంది. షారుఖ్‌ హీరోగా దీపికా పదేకొణె హీరోయిన్‌గా నటించిన ఈ మూవీ ఒక్క హిందీ బెల్ట్‌లోనే 55 కోట్ల రూపాయల వరకూ నెట్‌ కలెక్సన్లను వసూలు చేసింది. భారీ అంచనాల మధ్య అత్యంత భారీ స్క్రీన్ లలో రిలీజ్ అయిన ఈ సినిమా స్పై యాక్షన్ థ్రిల్లర్ గా ప్రేక్షకుల ముందుకు వచ్చింది.మంచి కంటెంట్ తో వచ్చిన ఈ సినిమా సూపర్ హిట్ టాక్ తెచ్చుకోవడంతో షారుఖ్ అభిమానులు మాత్రమే కాదు.బాలీవుడ్ ఇండస్ట్రీ మొత్తం చాలా రోజుల తర్వాత వచ్చిన విజయాన్ని ఆస్వాదిస్తున్నారు.

జనవరి 25న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చితం.. శుక్రవారం నాటికి వరల్డ్ వైడ్ గా దాదాపు రూ.300 కోట్ల పైగా గ్రాస్ కలెక్షన్స్ రాబట్టి బాద్‌షా స్టామినా ఏంటో బాక్స్ ఆఫీస్ కి మరోసారి చూపించింది. దీనిబట్టి చూస్తే ఈ చిత్రం నెట్ షేర్ కలెక్షన్స్ సుమారు రూ.150 కోట్ల పైనే వచ్చినట్లు తెలుస్తుంది. హిందీ బెల్ట్ లో కేజీఎఫ్-2 మూడు రోజులకు గాను రూ.140.50 కోట్ల షేర్ సంపాదించింది. ఇప్పుడు పఠాన్ రూ.150 కలెక్షన్స్ సాధించి కేజీఎఫ్-2 రికార్డు ని బద్దలుకొట్టింది. కాగా ఇంకో రెండు రోజులు.. శనివారం, ఆదివారం వెకెండ్ హాలిడేస్ ఉన్నాయి. ఇదే రేంజ్ లో పఠాన్ కలెక్షన్స్ రాబడితే ఈ రెండు రోజుల హాలిడేస్‌లో 200 కోట్ల రాబట్టడంలో సందేహం లేదు

ఇదిలా అనగా ఈ సినిమా ఓటీటి  హక్కులను ప్రముఖ సంస్థ  అమెజాన్ ప్రైమ్ వీడియో సొంతం చేసుకుంది. బాలీవుడ్ వర్గాల నుంచి అందుతున్న సమాచారం మేరకు ఏప్రియల్ 25, 2023 నఈ సినిమా ఓటిటిలో ప్రత్యక్ష్యం కానుంది. అప్పటికి థియేటర్ రన్ పూర్తి కానుంది.
 
'పఠాన్' మూవీపై ఆరంభం నుంచే భారీ స్థాయిలో అంచనాలు ఏర్పడ్డాయి. దీంతో ఈ మూవీ హక్కులకు ఓ రేంజ్‌లో డిమాండ్ ఏర్పడింది. ఫలితంగా ఈ యాక్షన్ మూవీకి దాదాపు రూ. 250 - 260 కోట్లు మేర బిజినెస్ జరిగినట్లు తెలిసింది. అందుకు అనుగుణంగానే దీన్ని దాదాపు 8000లకు పైగా థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల చేశారు. అలాగే బాలీవుడ్ బాద్‌షా షారూఖ్ ఖాన్‌ను ప్రపంచ వ్యాప్తంగా భారీ ఫాలోయింగ్ ఉన్న విషయం తెలిసిందే. అందుకే 'పఠాన్' చిత్రాన్ని చాలా దేశాల్లో గ్రాండ్‌గా విడుదల చేశారు. దీంతో ఈ మూవీ ఏకంగా ఓవర్సీస్‌లో  రూ. 38 కోట్లు రాబట్టి సంచలనం సృష్టించింది. ఇక, ఆయా దేశాల్లో కూడా అడ్వాన్స్ బుకింగ్ ద్వారా ఈ చిత్రం హాఫ్ మిలియన్ డాలర్లకు పైగానే వసూలు చేసింది. యాష్ రాజ్ ఫిలిమ్స్ వారు నిర్మించిన ఈ సినిమాలో జాన్ అబ్రహం కీలక పాత్ర పోషించాడు.చూడాలి ఈ సినిమా ఎన్ని కలెక్షన్స్ సాధించి ఎన్ని రికార్డులను తిరగరాసిందో.

Follow Us:
Download App:
  • android
  • ios