సాధారణంగా సౌత్ హీరోలు,సౌత్ సినిమాలు అంటే బాలీవుడ్ హీరోలకు ఇష్టం ఉండదు. చిన్న చూపు చూస్తుంటారు కూడా. ఇక బాలీవుడ్ బాద్ షా షారుక్ కూడా చాలా సార్లు ఇండైరెక్ట్ గా సౌత్ ను అన్నవాడే. ఇక  రీసెంట్ గా షారుఖ్  సౌత్ స్టార్ హీరో విజయ్ గురించి చేసిన కామెంట్స్ అందరిని ఆశ్చర్యానికి గురిచేశాయి.  

సాధారణంగా సౌత్ హీరోలు,సౌత్ సినిమాలు అంటే బాలీవుడ్ హీరోలకు ఇష్టం ఉండదు. చిన్న చూపు చూస్తుంటారు కూడా. ఇక బాలీవుడ్ బాద్ షా షారుక్ కూడా చాలా సార్లు ఇండైరెక్ట్ గా సౌత్ ను అన్నవాడే. ఇక రీసెంట్ గా షారుఖ్ సౌత్ స్టార్ హీరో విజయ్ గురించి చేసిన కామెంట్స్ అందరిని ఆశ్చర్యానికి గురిచేశాయి. 

దళపతి విజయ్‌, బీస్ట్‌ మూవీపై బాలీవుడ్‌ బాద్‌షా షారుక్‌ ఖాన్‌ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. విజయ్ నుంచి త్వరలో రాబోతున్న సినిమా బీస్ట్. ఈమూవీ హిందీలో కూడా రిలీజ్ కాబోతోంది. ఈ మూవీ హిందీ ట్రైలర్ ను చూసిన షారుక్‌ విజయ్‌పై ప్రశంసల వర్షం కురిపించాడు. 

షారుఖ్ ట్వీట్‌ చేస్తూ విజయ్‌ గురించి గొప్పగా చెప్పాడు. విజయ్ కు తాను పెద్ద ఫ్యాన్‌ అంటూ చెప్పుకొచ్చాడు. అంతే కాదు బీస్ట్‌ ట్రైలర్‌ను కూడా ఆయన ట్విట్టర్ లో షేర్‌ చేశాడు. ఈ సందర్బంగా మరికొన్ని ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు షారుఖ్. నేను డైరెక్టర్‌ అట్లీతో కూర్చున్నాను. నాలాగే ఆయన కూడా విజయ్‌కి పెద్ద ఫ్యాన్‌. బీస్ట్‌ ట్రైలర్‌ చూశాను. అద్భుతంగా ఉంది. బీస్ట్‌ మూవీ టీం అందరికి శుభాకాంక్షలు అంటూ షారుఖ్ ట్విట్టర్ లో రాశారు. 

Scroll to load tweet…

ఒక బాలీవుడ్ హీరో.. అది కూడా ఒకప్పుడు బాలీవుడ్ ను ఏలిని బాద్ షా విజయ్ గురించి ఇలా ట్వీట్ చేయడంతో.. అది చూసిన విజయ్‌ ఫ్యాన్స్‌ తెగ మురిసి పోతున్నారు. షారుక్‌ ఖాన్‌ స్వయంగా బీస్ట్‌ ట్రైలర్‌ను ప్రశంసించడం గర్వంగా ఉంది. అలాగే ఆయన విజయ్‌కు ఫ్యాన్‌ అంటూ చెప్పడం సంతోషాన్ని ఇచ్చింది. అంటూ ఫ్యాన్స్ రిప్లైస్ ఇస్తున్నారు. 

అంతే కాదు ఒక అద్భుతమైన ట్రైలర్‌కు బాలీవుడ్ బాద్ షా నుంచి ప్రశంసలు రావడం ఫ్యాన్స్ కు ఉత్సాహాన్ని ఇస్తుంది. ఇది ఇంతటితో ఆగకుండా.. భవిష్యత్తులో షారుక్‌, విజయ్‌ కలిసి ఓ సినిమా తీస్తారని ఆశిస్తున్నాం’ అంటూ విజయ్‌ అప్పుడే సోషల్ మీడియాలో మొదలుపెట్టేశారు. ఇది షారుక్‌, విజయ్‌ ఫ్యాన్స్‌ సంతోషించే విషయం. థ్యాంక్యూ కింగ్‌ ఖాన్‌. త్వరలోనే షారుక్‌, విజయ్‌లు కలిసి ఓ సినిమా చేస్తే చూడాలని ఉంది.. ఒక్క సారి ఇద్దరు స్టార్లు దీని గురించి ఆలోచించండి అంటూ.. ఫ్యాన్స్ కామెంట్స్ మొదలెట్టారు. 

అంతే కాదు డైరెక్టర్స్‌ అట్లీ, జగదీశ్‌ బ్లిస్‌లను ఉద్దేశించి ట్వీట్స్ చేస్తున్నారు ఫ్యాన్స్‌. బీస్ట్‌ మూవీ తమిళ,తెలుగు,హిందీ భాషల్లో రిలీజ్ కాబోతోంది. రీసెంట్ గా ట్రైలర్‌ అన్ని భాషల్లో రిలీజ్ అయ్యి పాజిటీవ్ టాక్ తెచ్చుకుంది. ఈ ట్రైలర్‌లోని యాక్షన్‌ సీన్స్‌, సినిమాపై మరింత హైప్ ను క్రియేట్ చేస్తోంది. ఈ సినిమాను ప్రపంచ వ్యాప్తగా . ఏప్రిల్‌ 13న దేశవ్యాప్తంగా రిలీజ్ చేయబోతున్నారు.