బాలీవుడ్ బాద్ షా, స్టార్ హీరో షారుక్ ఖాన్ ప్రమాదానికి గురయ్యారు. షూటింగ్ లో జరిగిన యాక్సిడెంట్ లో ఆయనకు గాయాలు అయినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం షారుక్ పరిస్థితి ఏంటి? 

DID YOU
KNOW
?
కింగ్ లో షారుక్ కూతురు
కింగ్ మూవీలో షారుక్ కూతురు సుహానా ఖాన్ నటిస్తోంది. తండ్రితో కలిసి ఫస్ట్ టైమ్ స్క్రీన్ షేర్ చేసుకోబోతోంది స్టార్ కిడ్.

బాలీవుడ్ హీరో షారుక్ ఖాన్ కు గాయాలు అయినట్టు తెలుస్తోంది. ‘కింగ్’ సినిమా షూటింగ్ లో జరిగిన ప్రమాదంలో ఆయన గాయపడినట్లు సమాచారం. ఓ యాక్షన్‌ సీన్ ను షూట్ చేస్తున్న టైమ్ లో ఈ ప్రమాదం జరిగినట్టు తెలుస్తోంది. షారుఖ్ ఈ సన్నివేశంలో డూప్‌ లేకుండా నటించడంతో పాటు, రిస్క్ స్టంట్‌ ను చేస్తుండగా ప్రమాదానికి గురయ్యారు. ఈ యాక్సిడెంట్ లో షారుక్ ఖాన్ తీవ్రంగా గాయపడ్డారని, ఆయనకు పలుచోట్ల పెద్ద గాయాలు అయినట్టు తెలుస్తోంది. దీంతో షూటింగ్ నిలిచిపోయిందని సమాచారం.

షారుక్ ఖాన్ ట్రీట్మెంట్ కోసం తన టీమ్ తో కలిసి అమెరికా వెళ్లినట్లు బాలీవుడ్ లో ప్రచారం జరుగుతోంది. ఏం జరిగిందనే విషయంపై పూర్తి వివరాలు తెలియరాలేదు. షారుక్ గాయాలకి సంబంధించి వివరాలు తెలియాల్సి ఉంది. షారుక్ ఖాన్ టీమ్ మాత్రం ఈ విషయంలో ఎటువంటి ప్రకటన చేయలేదు. 

బాలీవుడ్ లో కింగ్ ఖాన్ సన్నిహిత వర్గాల సమాచారం ప్రకారం అది తీవ్రమైన గాయం కాదని, కండరాల గాయం మాత్రమే అయ్యిందని తెలుస్తోంది. ఇక షారుక్ కి గాయపడడంతో ‘కింగ్‌’ షూటింగ్‌ ను నిలిపివేశారు. హీరో కోలుకోవడానికి నెలరోజులకు పైనే సమయం పట్టే అవకాశం ఉండటంతో కింగ్ షూటింగ్ ను సెప్టెంబర్‌ కు వాయిదా వేసినట్లు తెలుస్తోంది.

సిద్ధార్థ్‌ ఆనంద్‌ డైరెక్షన్ లో షారుక్ ఖాన్ ఆయన కుమార్తె సుహానా ఖాన్ ప్రధాన పాత్రల్లో రూపొందిస్తున్న యాక్షన్‌ మూవీ కింగ్. ఈ సినిమాలో సుహానాకు తల్లి పాత్రలో రాణీ ముఖర్జీ నటిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమా షూటింగ్ సూపర్ ఫాస్ట్ గా జరుపుకుంటున్న క్రమంలోనే యాక్షన్ సన్నివేశాలు షూట్ చేస్తుండగా షారుక్ ఖాన్ గాయపడ్డారని సమాచారం.