మన దేశంలో కరోనా మహమ్మారి ఇప్పుడిప్పుడే విజృభిస్తోంది. ముఖ్యంగా అన్‌ లాక్‌ ప్రకియ మొదలైన దగ్గర నుంచి కేసుల సంఖ్య విపరీతంగా పెరుగుతోంది. మహారాష్ట్రలో వైరస్ తీవ్రత మరింత ఎక్కువగా ఉంది. రోజు వేల సంఖ్యలో కేసులు నమోదు కావటంతో పాటు వందల సంఖ్యలో మరణాలు సంభవిస్తున్నాయి. దీంతో అన్ని వర్గాల్లోనూ వణుకు మొదలైంది. ప్రముఖుల ఇళ్లలోనూ కరోనా కేసులు నమోదు కావటం కలవరపెడుతోంది.

తాజాగా బాలీవుడ్‌ మెగాస్టార్‌ బిగ్‌ బీ అమితాబ్ బచ్చన్‌కు కరోనా పాజిటివ్ రావటంతో ఇండస్ట్రీ ఉలిక్కి పడింది. అమితాబ్‌ ఇంట్లో నలుగురు పాజిటివ్‌ అని నిర్థారణ కావటంతో సెలబ్రిటీలు ముందు జాగ్రత్త చర్యలకు ఉపక్రమించారు. తాజాగా బాలీవుడ్‌ బాద్‌ షా షారూఖ్‌ ఖాన్‌ ఇల్లు చూసి అభిమానులు షాక్‌ అవుతున్నారు. షారూఖ్‌ తన ఇంటిని పూర్తిగా పాలిథిన్‌ కవర్‌తో  కప్పేశాడు.

ఇటీవల కరోనా వైరస్‌ గాలిలో కూడా ప్రయాణిస్తుందన్న వదంతులు రావటంతో షారూఖ్‌ ఈ నిర్ణయం తీసుకున్నాడని భావిస్తున్నారు. అయితే మరో వాదన కూడా వినిపిస్తోంది. ముంబైలో భారీగా వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో షారూఖ్‌ ముందుగా జాగ్రత్తగా ఇలా ప్లాస్టిక్‌ కవర్‌తో ఇంటిని కప్పేశాడంటున్నారు. షారూక్‌ ప్రతీ ఏడాది వర్షా కాలంలో తన ఇంటిని ఇలాగే కప్పేస్తాడన్న టాక్ వినిపిస్తోంది.