Asianet News TeluguAsianet News Telugu

షాక్ :'సలార్' సోలోగానే? పోటీ నుంచి తప్పుకున్న షారూఖ్

షారూఖ్ ఖాన్ సైతం ప్రమోషన్స్ లో దూకుడుని చూపించటం లేదు. సైలెంట్ గా ఉన్నాడు. ట్రెలర్ సైతం తెలుగులో రిలీజ్ చేయకపోవటం..

Shah Rukh Khan Dunki will not have a release in Telugu on its release day ? jsp
Author
First Published Dec 7, 2023, 9:28 AM IST

ఎదురుచూసిన యానిమల్ ఎవరూ ఊహించని విధంగా దుమ్ము రేపుతోంది.  ఇక ఇప్పుడు అందరి దృష్టీ సలార్, డంకీ.. పైనే ఉంది.  ఇండియన్ భాక్సాఫీస్ దగ్గర  ఈ రెండు సినిమాలు ఏ విధంగా ఢీకొన బోతున్నాయి..గెలుపు ఎవరిది అని అంచనాలు వేస్తున్నారు. ఈ రెండు మెగా మూవీస్ ఒక రోజు తేడాలో రిలీజ్ కానుండటంతో బాక్సాఫీస్ దగ్గర సూపర్ ఫైట్ తప్పేదు.  అయితే తెలుగు నుంచి పోటీలో డింకీ తప్పుకుందని సమాచారం. ఇక్కడ థియేటర్స్ సమస్య ఉండటంతో పాటు, ఆ కంటెంట్ తెలుగు వారికి సంభందించింది కాదని కొన్ని ప్రాంతాలకే పరిమితమైన సమస్య అని, ఇక్కడ వారు కనెక్ట్ అవ్వటం కష్టమని భావించారట. 

దాంతో తెలుగు రిలీజ్ ని మొదట అనుకున్నా తర్వాత ఆపేసారని తెలుస్తోంది. తెలుగులో ఇప్పుడు షారూఖ్ సినిమాలు ఫామ్ లో ఉన్నాయి. ఈ సినిమా రిలీజ్ అయ్యి ఆడకపోతే మార్కెట్ పోవటం తప్పించి ఒరిగేదేమీ ఉండదని ఈ డెసిషన్ తీసుకున్నారని బాలీవుడ్ మీడియా అంటోంది. దానికి తగ్గట్లే షారూఖ్ ఖాన్ సైతం ప్రమోషన్స్ లో దూకుడుని చూపించటం లేదు. సైలెంట్ గా ఉన్నాడు. ట్రెలర్ సైతం తెలుగులో రిలీజ్ చేయకపోవటం ఈ వార్తలకు ఊతం ఇస్తోంది. అయితే అఫీషియల్ గా అయితే తెలుగు రిలీజ్ లేదని మాత్రం ప్రకటించలేదు. ఏమో లాస్ట్ మినిట్ లో ఏదైనా జరగచ్చు  అని కొందరంటున్నారు. 

ఇక ఈ సంవత్సరం షారుఖ్ ఖాన్   ఫుల్ జోష్ మీదున్నారు. చాలా కాలంగా వరుస డిజాస్టర్లతో కొట్టుమిట్టాడుతున్న  బీటౌన్ ఇండస్ట్రీకి  తన సినిమాలతో ఊపిరినిచ్చాడు. పఠాన్ సినిమాతో రికార్డ్స్ తిరగరాశాడు బాద్ షా. ఇక ఇటీవలే జవాన్ మూవీ సైతం భారీగా కలెక్షన్స్ రాబట్టింది.  తమిళ డైరెక్టర్ అట్లీ దర్శకత్వంలో షారుఖ్, నయన్, దీపికా కలిసి నటించిన ఈ మూవీకి ఊహించని స్థాయిలో రెస్సాన్స్ వచ్చింది.  బాక్సాఫీస్ వద్ద దాదాపు రూ.1100 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టి రికార్డ్స్ బ్రేక్ చేసింది ఈ చిత్రం. ప్రస్తుతం ఈ మూవీ నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతుంది.  

ఇక  డంకీ సినిమా కథ విషయానికి వస్తే... ఒక ఊళ్లో ఉండే అయిదుగురు స్నేహితులు ఎలాగైనా లండన్ వెళ్లాలి అనుకుంటారు. అధికారికంగా వెళ్లాలంటే ఇంగ్లీష్ రావాలని తెలుస్తుంది. అలాగే వారికి వీసా కూడా రిజెక్ట్ అవుతుంది. అయితే గతంలో బ్రిటిష్ వారు వచ్చినట్లే అక్రమంగా వెళ్తారు. అయితే వారు లండన్ ఎలా వెళ్లారు ?ఆ సమయంలో వారు ఎదుర్కొన్న సమస్యలు ఏంటీ? అనేది డంకీ చిత్రం. చాలా కాలం తర్వాత మరోసారి తన కామెడీ టైమింగ్ తో అలరించేందుకు సిద్ధమయ్యారు షారుఖ్.

ఈ సినిమాలో తాప్సీ పన్ను, విక్కీ కౌశల్ కీలకపాత్రలు పోషించారు. ఈ సినిమాకు రాజ్ కుమార్ హిరానీ దర్శకత్వం వహించారు. ఎన్నో అంచనాలు నెలకొన్న ఈ మూవీ డిసెంబర్ 21న విడుదల కాబోతుంది. అయితే అదే సమయంలో సలార్ సైతం విడుదల కాబోతుండడంతో బాక్సాఫీస్ వద్ద షారుఖ్, ప్రభాస్ మధ్య పోటీ ఉండనుంది. ఈ ఏడాది వరుసగా మూడు చిత్రాలతో షారుఖ్, హ్యాట్రిక్ హిట్ సాధించాలని చూస్తున్నారు.
 

Follow Us:
Download App:
  • android
  • ios