షారుఖ్ కూతురు సుహానా వైరల్ హాట్ బికినీ పిక్

shah rukh khan daughter suhana viral hot bikini pic
Highlights

సుహానీ వైరల్ హాట్ బికినీ పిక్ తో యూత్ షేక్ అవుతున్నారు.

స్టార్ హిరోయిన్లు, హీరోల పిల్లలు ఇండస్ట్రీలో ఎంట్రీ ఇచ్చి స్టార్లుగా ఎదగటం సర్వ సాధారణమే. టాలీవుడ్ నుంచి బాలీవుడ్ దాక అన్ని పరిశ్రమల్లోనూ.. స్టార్స్ పిల్లలు ఇలా వచ్చి సక్సెస్ కూడా సాధిస్తున్నారు. ఇక ఇటీవల సోషల్ మీడియా ప్రభావం ఎక్కువవటంతో ముఖ్యంగా ప్రముఖ బాలీవుడ్ స్టార్ల పిల్లలంతా సోషల్ మీడియాలో తెగ యాక్టివ్‌గా ఉంటున్నారు. తమ హాలిడే ట్రిప్స్, ఫ్రెండ్స్‌ తో కలిసి ఔటింగ్‌కు వెళ్లిన ఫోటోలు పోస్టు చూస్తూ.. ఫాలోయింగ్ పెంచుకునే ప్రయత్నం చేస్తున్నారు.

తాజాగా బాలీవుడ్ బాద్ షా.. షారుక్ ఖాన్ కూతురు సుహానా కూడా స్విమ్మింగ్ ఫూల్‌లో బికినీలో జలకాలాడుతున్న ఫోటో పోస్టు చేసింది. ఈ ఫోటో ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఈ ఫోటోపై కొందరు విమర్శలు చేస్తుండగా, మరికొందరు సుహానా చాలా అందంగా ఉందని, షారుక్ ఖాన్‌కు మిర్రర్ ఇమేజ్‌లా ఉందనే కామెంట్స్ చేస్తున్నారు.

అయితే సోషల్ మీడియాలో సుహానా ఖాన్ చేస్తున్న హడావుడి చూసిన కొందరు ఆమె త్వరలో బాలీవుడ్ ఎంట్రీ ఇవ్వబోతోందా? అనే సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. సినీ తారల పిల్లలు తమ తల్లిదండ్రుల అడుగు జాడల్లో నడుస్తూ ఇండస్ట్రీ వైపు రావడం సహజమే. మరి సుహానా తండ్రి దారిలో నటన వైపు వస్తుందా? తల్లి దారిలో డిజైనింగ్ వైపు వెళుతుందో. మొత్తానికి ఇప్పుడు మాత్రం సుహానా క్రేజీ గా మారిపోయింది.

loader