మొదటి చిత్రంతోనే తండ్రి అల్లు అర్జున్ కి తగ్గ కూతురిగా అర్హ నిరూపించుకోవాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు. నేడు శాకుంతలం ట్రైలర్ విడుదల కాగా... అర్హ లుక్ సైతం రివీల్ చేశారు. ట్రైలర్ చివర్లో సింహం మీద కూర్చొని వస్తున్న అర్హ ఆకట్టుకుంది.


స్టార్ కిడ్ అల్లు అర్హ నటిస్తున్నారన్న న్యూస్ శాకుంతలం చిత్రానికి మంచి ప్రచారం కల్పించింది. శాకుంతలం మూవీలో అర్హ చేస్తున్న రోల్ పై అవగాహన ఉన్నప్పటికీ ఆమె లుక్ ఎలా ఉంటుంది? పౌరాణిక పాత్రలో ఎలా నటిస్తుందనే అంచనాలు, ఆసక్తి ఏర్పడ్డాయి. మొదటి చిత్రంతోనే తండ్రి అల్లు అర్జున్ కి తగ్గ కూతురిగా అర్హ నిరూపించుకోవాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు. నేడు శాకుంతలం ట్రైలర్ విడుదల కాగా... అర్హ లుక్ సైతం రివీల్ చేశారు. ట్రైలర్ చివర్లో సింహం మీద కూర్చొని వస్తున్న అర్హ ఆకట్టుకుంది. 

ఈ జనరేషన్ యూత్ కి పురాణాలపై అవగాహన లేదు. ఇంగ్లీష్ మీడియం యుగంలో శకుంతల(Shaakuntalam) ఎవరంటేనే చెప్పడం కష్టం. ఇక ఆమె కొడుకు భరతుడు గురించి ఏం తెలుస్తుంది చెప్పండి. కాబట్టి చిత్ర యూనిట్ అర్హ పాత్ర రివీల్ చేసినా అది అబ్బాయి పాత్ర అని తెలిసింది కొందరికే. నేడు ట్రైలర్ చూశాక చాలా మంది థ్రిల్ ఫీల్ అయ్యారు. అర్హను అబ్బాయిగా చూపిస్తున్నారా...అని ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. 

ఇక పురాణ పురుషుల్లో భరతుడు ఒకరు. పాండవులు, కౌరవుల పూర్వీకుడు. చంద్రవంశం కి చెందినవాడు. ఆయన పేరు ఆధారంగానే ఇండియాకు భారత్ అనే పేరొచ్చిందంటారు. దుష్యంతుడు-శకుంతలకు జన్మించిన వీర పుత్రుడు. ఆ పాత్రనే అర్హ చేశారు. ఇక చిన్నప్పటి అబ్బాయిల పాత్రలు అమ్మాయిలతో చేయించడం... ఎప్పటి నుండో ఉన్న సాంప్రదాయం. బాల్యంలో అబ్బాయిలు అమ్మాయిలను పోల్చుకోలేం. అందుకే క్యూట్ గా ఉండే చైల్డ్ ఆర్టిస్ట్స్ ని రెండు విధాలుగా వాడేస్తారు. 

YouTube video player

కాగా శాకుంతలం ట్రైలర్(ShaakuntalamTrailer) ఆకట్టుకుంది. బడ్జెట్ పరిమితుల్లో మాక్సిమమ్ అవుట్ ఫుట్ ఇచ్చేందుకు గుణశేఖర్ ట్రై చేశారు. లేడీ ఓరియెంటెడ్ చిత్రానికి వందల కోట్లు కుమ్మరించలేరు. షూటింగ్ మొత్తం సెట్స్ లో పూర్తి చేశారు. విజువల్స్ బేస్డ్ మూవీ కావడంతో విఎఫ్ఎక్స్ వర్క్ కి సమయం తీసుకుంది. కాగా పౌరాణిక సినిమాలకు కూడా వచ్చీ రాని తెలుగులో డబ్బింగ్ చెప్పడం దారుణం. సమంత సొంతగా డబ్బింగ్ చెప్పుకోగా... ఆమె డైలాగ్స్ అసలు సెట్ కాలేదు.దుష్యంతుడు రోల్ చేసిన మోహన్ దేవ్ సైతం స్వయంగా డబ్బింగ్ చెప్పుకుట్లున్నారు. మోహన్ బాబు మాత్రమే గ్రాంథిక తెలుగు డైలాగ్స్ స్పష్టంగా పలికారు. ఇక కేవలం సమంత (Samantha)ఫేమ్, స్టార్డం మాత్రమే సినిమాను కాపాడాలి. గుణశేఖర్ కి ఒకప్పుడు ఉన్నంత గుర్తింపు లేదు. ఆయన దర్శకుడని సినిమాకు వచ్చే ప్రేక్షకులు తక్కువే. 

గుణశేఖర్-దిల్ రాజు నిర్మాణ భాగస్వాములుగా శాకుంతలం తెరకెక్కింది. మణిశర్మ సంగీతం అందించారు. ఫిబ్రవరి 17న వరల్డ్ వైడ్ ఐదు భాషల్లో విడుదల కానుంది.