Shaakuntalam : సమంత ‘శాకుంతలం’ టైలర్ రిలీజ్ డేట్ ఫిక్స్.. ఎప్పుడంటే?
స్టార్ హీరోయిన్ సమంత నటిస్తున్న పౌరాణిక చిత్రం ‘శాకుంతలం’ (Shaakuntalam). మూవీ నుంచి వరుస అప్డేట్స్ అందుతున్నాయి. తాజాగా ట్రైలర్ విడుదల తేదీని మేకర్స్ ప్రకటించారు.

గతేడాది సై-ఫై చిత్రం `యశోద` చిత్రంతో సమంత హిట్ అందుకుంది. ప్రస్తుతం మరో భారీ ప్రాజెక్ట్ ‘శాకుంతలం’తో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. పురాణాల ఆధారంగా శాకుంతలం, దుష్యంతుడి ప్రేమ కథ నేపథ్యంలో ఈ చిత్రం రూపుదిద్దుకుంటున్న విషయం తెలిసిందే. వచ్చే నెలలోనే విడుదల కాబోతుండటంతో మేకర్స్ బ్యాక్ టు బ్యాక్ అప్డేట్స్ అందిస్తున్నారు. ఇప్పటికే చిత్రం ప్రచార పోస్టర్లు ఆకట్టుకుంటున్నాయి. రీసెంట్ గా సినిమా విడుదల తేదీని కూడా అనౌన్స్ చేయగా.. తాజాగా ట్రైలర్ ను కూడా రిలీజ్ కు సిద్ధం చేశారు.
‘శాకుంతలం’ ట్రైలర్ ను విడుల చేసేందుకు డేట్ ఫిక్స్ చేశారు. జనవరి 9న మధ్యాహ్నం 12 : 06 గంటలకు రిలీజ్ కానుంది. పురాణాల్లోని ఈ విచిత్రమన ప్రేమ కథను ట్రైలర్ ద్వారా ఆడియెన్స్ కు పరిచయం చేయబోతున్నట్టు తెలిపారు. చిత్రానికి గుణశేఖర్ (Gunashekar) దర్శకత్వం వహిస్తున్నారు. దిల్ రాజు సమర్పణలో గుణ టీమ్ వర్క్స్ బ్యానర్‌పై నీలిమ గుణ నిర్మిస్తున్నారు. సమంత (Samantha), దేవ్ మోహన్, మోహన్ బాబు, అదితి బాలన్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. తెలుగుతో పాటు హిందీ, తమిళం, మలయాళం, కన్నడలోనూ డబ్డ్ వెర్షన్ లో విడుదల చేయబోతున్నారు. ఫిబ్రవరి 17న ప్రపంచ వ్యాప్తంగా థియేటర్లలో గ్రాండ్ గా రిలీజ్ చేసేందుకు షెడ్యూల్ చేశారు.
సమంత లేడీ ఓరియెంటెడ్ చిత్రాల్లో నటిస్తున్న విషయం తెలిసిందే. అందులో ఇది ఓ ప్రత్యేకమైన సినిమా నిలవబోతోంది. ప్రస్తుతం చిత్రీకరణ పూర్తి చేసుకు పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటోంది. త్రీడీలోనూ తెరకెక్కబోతున్న సినిమా ప్రమోషన్స్ ను యూనిట్ ఇప్పటికే ప్రారంభించింది. దీనికి తోడు బ్యాక్ టు బ్యాక్ అప్డేట్స్ ను అందిస్తున్నారు. ఇక చిత్రం రీరికార్డింగ్ విషయంలో ఇంటర్నేషనల్ క్వాలిటీని తీసుకొచ్చేందుకు మేకర్స్ ప్రయత్నం చేస్తున్నారు. ఇందుకు బుడాపెస్ట్ సింఫోనీ ఆర్కేస్ట్రా బృందం వినసొంపైన, పీరియాడిల్ ఫ్లేవర్ వచ్చేలా ట్యూన్ కంపోజ్ చేస్తుండటం విశేషం. మెలోడీ బ్రహ్మ మణిశర్మ సంగీతం అందిస్తున్నారు.