యాక్షన్ హీరోపై అత్యాచార కేసు?

sexual assault case on sylvester stallone
Highlights

ప్రముఖ హాలీవుడ్ యాక్షన్ హీరో సిల్వెస్టర్ స్టాలోన్ తనను అత్యాచారం చేశాడంటూ ఓ మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది

ప్రముఖ హాలీవుడ్ యాక్షన్ హీరో సిల్వెస్టర్ స్టాలోన్ తనను అత్యాచారం చేశాడంటూ ఓ మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న అధికారులు విచారణ చేపట్టనున్నారు. ఇక్కడ విషయం ఏమిటంటే ఈ అత్యాచారం జరిగింది ఇప్పుడు కాదు.. 28 ఏళ్ల క్రితమని చెబుతున్నారు. 1990లలో లాస్ వేగాస్ కు చెందిన ఓ మహిళ సిల్వెస్టర్ ఆటోగ్రాఫ్ కోసం అతడి వద్దకు వెళ్లగా.. తన రక్షకుడితో కలిసి అతడు ఆమెను అత్యాచారం చేసినట్లు గతేడాది డిసంబర్ లో కేసు పెట్టింది సదరు మహిళ.

అయితే ఈ విషయాన్ని అప్పుడే చెప్పలేకపోయానని స్టాలోన్ తనను చంపేస్తానని బెదిరించినట్లు దీంతో ధైర్యం చాలక ఫిర్యాదు చేయలేకపోయానని ఆమె చెప్పుకొచ్చింది. చట్ట ప్రకారం లైంగిక వేధింపులు ఎదుర్కొన్న బాధితులు నేరం జరిగిన పదేళ్లలోపే కంప్లైంట్ చేయాలి. కానీ ఇక్కడ కేసు అలా లేదు. నేరం జరిగి 28 ఏళ్లు దాటింది. ఆమె చేసే ఆరోపణల్లో నిజం లేదని స్టాలోన్ తరఫు న్యాయవాది అంటున్నారు. 

ఆమె చెప్పేవి నిజాలు కాదని నిరూపించడానికి మా దగ్గర సాక్ష్యాలు కూడా ఉన్నాయని చెబుతున్నారు. ఆమె కావాలనే స్టాలోన్ పై తప్పుడు కేసు పెట్టిందని అన్నారు. మరి ఈ విషయంలో అధికారులు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి! 

loader