కరోనా కోరల్లో చిక్కుకొని ప్రపంచం విలవిలలాడుతోంది. సామాన్యులు, సెలబ్రిటీలు అనే తేడా లేకుండా అనేక మంది కరోనాకు బలైపోయారు. ‌ భారత్ లో ఇప్పటి వరకు లక్షకు పైగా కరోనా మరణాలు సంభవించాయి. అలాగే దేశంలోని అనేక చిత్ర పరిశ్రమల నుండి అనేక మంది ప్రముఖులు కరోనా సోకి మరణించారు. తాజాగా ప్రముఖ బాలీవుడ్‌ సీరియల్ నటి దివ్యా భట్నాగర్ కరోనా సోకి మరణించడం జరిగింది. 34ఏళ్ల దివ్యా భట్నాగర్ సోమవారం తెల్లవారు జామున మృతి చెందినట్లు తెలుస్తుంది. 
 
కొద్దిరోజుల క్రితం కరోనా లక్షణాలు కనిపించడంతో ముంబైలోని సెవెన్‌హిల్స్‌ ఆస్పత్రిలో దివ్యా జాయిన్ అయ్యారు. ఆమె ఆరోగ్యం విషమ స్థితికి చేరుకోవడంతో వెంటిలేటర్ పై ఉంచి చికిత్స అందిస్తున్నారు. కాగా నేడు తెల్లవారు జామున ఆమె పరిస్థితి పూర్తిగా విషమించిందట. కరోనా కారణంగా ఆమె అధిక రక్తపోటుకు గురయ్యారట. ఆ కారణంగా ఆమె తుది శ్వాస విడిచినట్లు తెలుస్తుంది. 
 
దివ్య అకాల మరణం పలువురు టీవీ ప్రముఖులను దిగ్ర్భాంతికి గురిచేసింది.  సోషల్‌ మీడియా వేదికగా ఆమెకు సంతాపం తెలుపుతున్నారు. కాగా దివ్య భట్నాగర్ కామెడీ షో తేరా యార్ హూన్ మెయిన్ షూటింగ్‌లో సమయంలో అనారోగ్యంతో బాధపడుత్ను ఆమెను ఆసుపత్రికి తరలించాల్సి వచ్చింది. ఆమె ఏ రిషిత క్యా కెహలాతా హై, సంస్కార్, ఉడాన్ వంటి సిరీయల్స్‌లో నటించారు.