ఒక సినిమా  సూపర్ హిట్ అయితే .. ఆ సినిమాకి సీక్వెల్ ను రెడీ చేయడమనేది సినిమావాళ్లకు మహా సరదా. ఎందుకంటే ఆ సరదాలో బోలెడు క్రేజ్, బిజినెస్ దాగి ఉంది.  అందుకోసమే ఇప్పుడు 'గూఢచారి' సినిమాకి సీక్వెల్ రూపొందించటానికి సన్నాహాలు మొదలయ్యాయి.  అడివి శేష్ హీరోగా శశికిరణ్ తిక్క దర్శకత్వంలో నిర్మితమైన ఆ సినిమా మంచి హిట్ అయ్యి, క్రిటిక్స్ ప్రశంసలు సైతం పొందింది. 

చిత్రం చివరలో  ఆ సినిమాకి సీక్వెల్ ఉంటుందనే హింట్ ఇస్తూనే ముగించారు. ఇప్పుడు సీక్వెల్ కి సంబంధించిన కథను రెడీ చేసే పనిలో అడివి శేష్ కొంతకాలంగా బిజీగా వున్నాడు. 'గూఢచారి'లోని ప్రధాన పాత్రల పరిధిని పెంచుతూ ఆయన స్క్రిప్ట్ సిద్ధం చేస్తున్నారు. 'గూఢచారి' సినిమా స్క్రిప్ట్ వర్క్ లో ముఖ్యమైన పాత్రను పోషించిన రాహుల్ పాకాల, ఈ సీక్వెల్ కి దర్శకుడిగా వ్యవహరించనున్నారు. ఈ విషయమై అధికారికంగా ప్రకటన వచ్చింది.

అడవి శేషు పుట్టిన రోజు సందర్బంగా అభిషేక్ పిక్చర్స్ వారు విడుదల చేసిన ఈ ప్రకటన ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.  2019 మధ్యలో మొదలయ్యి 2020లో  ఈ సినిమా రిలీజ్ కానుంది అని తెలియచేసారు.