జేమ్స్ కెమరూన్ అధ్బుతాల్లో ఎప్పటికీ నిలిచిపోయే చిత్రం 'టైటానిక్'. ఈ సినిమా అప్పట్లో ఎన్ని సంచలనాలు సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. లియానార్డో డికాప్రియో, కేట్ విన్స్‌లెట్‌ జంటగా నటించిన ఈ సినిమా వివిధ భాగాలలో 11 ఆస్కార్ అవార్డులను సొంతం చేసుకుంది.

1912లో ప్రమాదవశాత్తు సముద్రంలో మునిగిపోయిన టైటానిక్ ఓడ నేపధ్యంలో ఈ సినిమాను తెరకెక్కించారు. అయితే ఇప్పుడు ఈ సినిమాకి సీక్వెల్ రాబోతుంది.

 ఆస్ట్రేలియాకి చెందిన ప్రముఖ వ్యాపారవేత్త, రాజకీయనాయకుడైన క్లైవ్ పామర్ ఈ సినిమాకి సీక్వెల్ తీయడానికి ప్లాన్ చేస్తున్నాడు. నిజానికి 2012లోనే ఈ సినిమాకి సీక్వెల్ ప్లాన్ చేశారు కానీ ఇప్పటికి కుదిరింది. 

సీక్వెల్ కోసం ఓ కొత్త టైటానిక్ ఓడని రూపొందించనున్నారు. మొదటి భాగంలో చూపించినట్లుగానే ఇందులో ఓడ కూడా సౌథాంప్టన్ నుండి న్యూయార్క్ కి ప్రయాణిస్తుంటుంది. 2022లో ఈ సినిమా విడుదల చేస్తారట.