తెలుగు టీవీ రియాల్టీ షో బిగ్ బాస్ 2 కంటిస్టెంట్, హేతువాది బాబు గోగినేనిపై యువ ఆధ్యాత్మికవేత్త శాంభవి సంచలన ఆరోపణలు చేసింది. తమపై బురద జల్లడానికి బాబు గోగినేని తమ ఆశ్రమంలో ఒక శవాన్ని పూడ్చిపెట్టించాడని ఆమె ఆరోపించింది. తమను ఇబ్బంది పెట్టడానికి తమ ఫొటోలను మార్ఫింగ్ చేసి దుష్ప్రచారం చేస్తున్నాడని మండిపడ్డారు. దలైలామాపైనా బాబు అతస్య ఆరోపణలు చేస్తున్నారని ఆరోపించారు.

హిమాచల్ ప్రదేశ్‌లోని ధర్మశాల నుంచి ఆమె ఈమేరకు ఒక సెల్ఫీ వీడియోను మీడియాకు పంపింది.. ’మేం సూర్యనంది(కర్నూలు జిల్లా) నుంచి పారిపోయామని బాబు గోగినేని ప్రచారం చేస్తున్నాడు.. అతడే మా ఆశ్రమం పక్కన శవం పూడ్చిపెట్టించాడు. ఎన్నో ట్రబుల్స్ క్రియేట్ చేశాడు. అందుకే నా రక్షణ కోసం మా అమ్మ అక్కడి నుంచి నన్ను హిమాచల్ ప్రదేశ్‌కు తీసుకొచ్చింది. అతని పబ్లిసిటీ కోసం నేను స్కూల్ డ్రస్ వేసుకున్నట్లు నా ఫొటోను మార్ప్ చేసి వాడుకున్నాడు.. నేను సంస్కృం వేదపాఠశాలలో తప్ప ఎక్కడా చదువుకోలేదు. దుష్ప్రచారం చేస్తున్నందుకు అతనిపై కఠిన చర్యలు తీసుకుంటాం.. ’ అని అన్నారు.

విదేశాల్లో పబ్లిసిటీ కోసం గొగినేని అసత్యాలు ప్రచారం చేస్తున్నాడని శాంభవి స్నేహితులు కూడా ఆరోపించారు. శాంభవికి అతీత శక్తులు ఉన్నట్లు కొన్నేళ్ల  కిందట ప్రచారం జరిగింది. అయితే అతంతా అబద్ధమని బాబు గోగినేని వాదించాడు.