Asianet News TeluguAsianet News Telugu

కాస్ట్లీ కార్ కొనిచ్చినా.. పని మాత్రం అవ్వలేదట!

గతంలో అమెరికాలో ఎన్నో సినిమాలను డిస్ట్రిబ్యూట్ చేసిన ఓ సీనియర్ వ్యక్తి ఈ మధ్య సినిమాల విషయంలో వెనక్కి తగ్గారు. అయితే టాలీవుడ్ కు చెందిన ఓ పెద్ద నిర్మాణ సంస్థతో ఆయనకు మంచి సంబంధాలు ఉన్నాయి.

senior overseas buyer gets hurt

సినిమా రంగంలో ఇప్పుడు ఓవర్సీస్ అనేది పెద్ద బిజినెస్ అయిపోయింది. స్టార్ హీరో సినిమా అంటే అక్కడ థియేట్రికల్ రైట్స్ రూ.20 కోట్లు దాటి పలికిన సందర్భాలు ఉన్నాయి. మహేష్ బాబు, పవన్ కళ్యాణ్, ప్రభాస్ వంటి స్టార్ హీరోలతో పాటు నాని, శర్వానంద్ వంటి యంగ్ హీరోలకు కూడా అక్కడ మంచి మార్కెట్ ఉంది. అయితే ఓవర్సీస్ డిస్ట్రిబ్యూషన్ ఇక్కడితో పోలిస్తే కాస్త భిన్నంగా ఉంటుంది.

ఆల్రెడీ ఎస్టాబ్లిష్ అయిన కొందరు డిస్ట్రిబ్యూటర్లకు మాత్రమే హక్కులు ఇవ్వడానికి ఇష్టపడతారు మన దర్శకనిర్మాతలు. గతంలో అమెరికాలో ఎన్నో సినిమాలను డిస్ట్రిబ్యూట్ చేసిన ఓ సీనియర్ వ్యక్తి ఈ మధ్య సినిమాల విషయంలో వెనక్కి తగ్గారు. అయితే టాలీవుడ్ కు చెందిన ఓ పెద్ద నిర్మాణ సంస్థతో ఆయనకు మంచి సంబంధాలు ఉన్నాయి. ఆ సంస్థ సినిమాలన్నీ దాదాపు ఓవర్సీస్ రిలీజ్ చేసింది ఈ సీనియర్ బయ్యరే.. గతంలో అదే బ్యానర్ కు చెందిన ఓ మంచి క్లాస్ మూవీని ఓవర్సీస్ లో రిలీజ్ చేసి లాభాలు అందుకున్నారు. ఈ సందర్భంగా నిర్మాణ సంస్థలో ఒకరికి కాస్ట్లీ కార్ ను గిఫ్ట్ గా ఇచ్చారట.

వారి బ్యానర్ లో వచ్చే తదుపరి సినిమాలు కూడా తనే డిస్ట్రిబ్యూట్ చేయాలని అనుకున్నారట. కానీ ఆ తరువాత నుండి సదరు నిర్మాత సంస్థ మరో బయ్యర్ కు సినిమాలు ఇస్తుండడంతో ఈ సీనియర్ బయ్యర్ తెగ బాధపడిపోతున్నాడు. కాస్ట్లీ కార్ బహుమతిగా ఇచ్చినా.. పని కాలేదని సన్నిహితుల వద్ద వాపోతున్నాడని తెలుస్తోంది. సినిమా ఇండస్ట్రీలో బంధాల కంటే బిజినెస్ కే ఎక్కువ ప్రాధాన్యతనిస్తారు. ఈ సీనియర్ బయ్యర్ విషయంలో కూడా అదే జరిగింది. 

Follow Us:
Download App:
  • android
  • ios