త్రివిక్రమ్ తన చిత్రాల్లో సీనియర్ హీరోయిన్లకు కీలక పాత్రలు ఇస్తుంటారు. అత్తారింటికి దారేదిలో నదియా, అజ్ఞాతవాసిలో ఖుష్బూ, అల వైకుంఠపురములో టబు ఇలా సీనియర్ హీరోయిన్లకు ఇంపార్టెంట్ రోల్స్ ఉంటాయి.
సూపర్ స్టార్ మహేష్ బాబు నేడు బిజీ బిజీగా గడుపుతున్నారు. ఒకవైపు ఏపీ సీఎం జగన్ తో టాలీవుడ్ సమస్యలపై చర్చించేందుకు మహేష్ మీటింగ్ లో పాల్గొన్నాడు. మరోవైపు నేడు మహేష్, నమ్రత తమ 17వ వెడ్డింగ్ యానివర్సరీ సెలెబ్రేట్ చేసుకుంటున్నారు.
ఇదిలా ఉండగా మహేష్ బాబు సినిమాల పరంగా కూడా బిజీగా మారుతున్నాడు. ప్రస్తుతం మహేష్.. పరశురామ్ దర్శకత్వంలో 'సర్కారు వారి పాట చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తోంది. ఈ మూవీ పై భారీ అంచనాలు ఉన్నాయి.
అలాగే దర్శకధీరుడు రాజమౌళితో కూడా మహేష్ సినిమా చేయాల్సి ఉంది. త్రివిక్రమ్ దర్శకత్వంలోని చిత్రం కూడా ప్రారంభం అయింది. త్రివిక్రమ్, మహేష్ కాంబోలో తెరకెక్కుతున్న మూడవ చిత్రం ఇది. ఈ చిత్రంలో పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తోంది.
తాజాగా ఈ చిత్రానికి సంబందించిన ఇంట్రెస్టింగ్ గాసిప్ ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. త్రివిక్రమ్ తన చిత్రాల్లో సీనియర్ హీరోయిన్లకు కీలక పాత్రలు ఇస్తుంటారు. అత్తారింటికి దారేదిలో నదియా, అజ్ఞాతవాసిలో ఖుష్బూ, అల వైకుంఠపురములో టబు ఇలా సీనియర్ హీరోయిన్లకు ఇంపార్టెంట్ రోల్స్ ఉంటాయి.
మహేష్ మూవీలో కూడా ఓ కీలక పాత్ర ఉండదట. మహేష్ తల్లి పాత్ర కోసం త్రివిక్రమ్ 90 దశకంలో ఓ వెలుగు వెలిగిన హీరోయిన్ రాధని ఎంపిక చేసుకోవాలని ప్రయత్నిస్తున్నారట. దీనితో ఆమెతో సంప్రదింపులు జరుపుతున్నట్లు తెలుస్తోంది. వివాహం తర్వాత రాధ సినిమాలకు ఫుల్ స్టాప్ పెట్టేసింది. ఇన్నేళ్ల తర్వాత ఆమె రీఎంట్రీ ఇస్తుందా అనేది ప్రశ్న. మరి ఈ వార్తల్లో ఈమేరకు వాస్తవం ఉందొ తేలాల్సి ఉంది.
రాధ 90వ దశకంలో ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించింది. ముఖ్యంగా మెగాస్టార్ చిరంజీవికి రాధ లక్కీ హీరోయిన్. వీరిద్దరి కాంబోలో వచ్చిన చిత్రాలు ఎక్కువగా సూపర్ హిట్స్ గా నిలిచాయి. చిరంజీవి ఎక్కువగా నటించిన హీరోయిన్లలో రాధ ముందు వరుసలో ఉంటుంది.
