Asianet News TeluguAsianet News Telugu

విజయ్ దేవరకొండ వదినగా సీనియర్ హీరోయిన్!

టాలీవుడ్ లో ఒకప్పుడు నటించిన సీనియర్ హీరోయిన్స్ ఇప్పుడు హీరోలకు అక్క వదినలుగా.. కుదిరితే తల్లిగా లేదంటే అత్తలుగా కనిపిస్తోన్న సంగతి తెలిసిందే. భూమిక ప్రస్తుతం వదిన లాంటి పాత్రలు బాగానే చేస్తూ సెకండ్ ఇన్నింగ్స్ లో రాణిస్తోంది. 

senior heroine key role in vijay devarakonda movie
Author
Hyderabad, First Published Nov 6, 2018, 5:36 PM IST

టాలీవుడ్ లో ఒకప్పుడు నటించిన సీనియర్ హీరోయిన్స్ ఇప్పుడు హీరోలకు అక్క వదినలుగా.. కుదిరితే తల్లిగా లేదంటే అత్తలుగా కనిపిస్తోన్న సంగతి తెలిసిందే. భూమిక ప్రస్తుతం వదిన లాంటి పాత్రలు బాగానే చేస్తూ సెకండ్ ఇన్నింగ్స్ లో రాణిస్తోంది. ఇక చాలా రోజుల తరువాత మరో సీనియర్ హీరోయిన్ కూడా హీరోగారి వదినగా కనిపించడానికి సిద్ధమైంది.   

కొన్నేళ్ల క్రితం వరకు తన హోమ్లీ నటనతో ఫ్యామిలీ ఆడియెన్స్ ను బాగా ఆకట్టుకున్న కళ్యాణి గురించి స్పెషల్ గా చెప్పనవసరం లేదు. అయితే ఈమె టాక్సీ వాలా సినిమాలో విజయ్ దేవరకొండకు వదిన పాత్రలో నటించినట్లు సమాచారం. ఆ సినిమా షూటింగ్ ఎండ్ అయ్యి చాలా రోజులవుతోంది. ఫైనల్ గా ఇటీవల పోస్ట్ ప్రొడక్షన్ పనులు ముగియడంతో సినిమాకు నవంబర్ 17వ తేదీన రిలీజ్ చెయ్యాలని డిసైడ్ అయ్యారు. 

కళ్యాణి పాత్ర సినిమాలో చాలా కీలకమని తెలుస్తోంది. థ్రిల్లర్ అంశంతో రానున్న ఈ సినిమా అందరిని ఆకట్టుకుంటుందని చిత్ర యూనిట్ చెబుతోంది. గీత ఆర్ట్స్ యువీ క్రియేషన్స్ సినిమాను భారీ స్థాయిలో రిలీజ్ చేయడానికి సిద్ధమయ్యాయి. మరి ఈ సినిమా ఎంతవరకు హిట్టవుతుందో చూడాలి.    

Follow Us:
Download App:
  • android
  • ios