Asianet News TeluguAsianet News Telugu

సురేందర్ రెడ్డి కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన వెంకటేష్..? షూటింగ్ ఎప్పటి నుంచంటే..?

యాక్షన్ సినిమాల దర్శకుడు సురేందర్ రెడ్డికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట..సీనియర్ హీరో వెంకటేష్. ప్రస్తుతం వైరల్అవుతున్న ఈ న్యూస్ లో నిజం ఎంత..? మూవీ ఎప్పుడు స్టార్ట్ కాబోతోంది..?

Senior Hero Venkatesh Movie With Director Surender Reddy JMS
Author
First Published Oct 10, 2023, 1:46 PM IST

యాక్షన్ సినిమాల దర్శకుడు సురేందర్ రెడ్డికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట..సీనియర్ హీరో వెంకటేష్. ప్రస్తుతం వైరల్అవుతున్న ఈ న్యూస్ లో నిజం ఎంత..? మూవీ ఎప్పుడు స్టార్ట్ కాబోతోంది..?

యంగ్ హీరోలకు పోటీ ఇస్తూ దూసుకుపోతున్నాడు సీనియర్ హీరో వెంకటేష్. ఒక రకంగా చెప్పాలంటే.. యంగ్ స్టార్స్ కంటే కూడా ఎక్కువ సక్సెస్ రేట్ ను సాధిస్తున్నాడు వెంకీ. ఆయన చేసిన ప్రతీ సినిమా హిట్ అవుతోంది. బాక్సాఫీస్ దగ్గర మంచి ఫలితాలు రాబడుతోంది. వెంట వెంటనే హిట్లు పడుతండటంతో.. వెంకీ కూడా మంచి మంచి కథలు ఎంచి మరీ సినిమాలు చేస్తూ.. వస్తున్నాడు. అంతే కాదు వరుసగా ప్రయోగాలు  కూడా చేస్తున్నాడు. తన ఏజ్ కు తగ్గ కథలు సెలక్ట్ చేసుకుని.. పాత్రల విషయంలో కూడా అదే జాగ్రత్తను పాటిస్తున్నాడు వెంకీ. 

ఇప్పటికే నారప్ప, దృశ్యం2,  ఎఫ్3 లాంటి సినిమాలతో మంచి ఊపు మీద ఉన్నాడు వెంకీ..తాజాగా సైధవ సినిమాతో రిలీజ్ కు రెడీగా ఉన్నాడు. ఈసినిమా కోసం విక్టరీ ఫ్యాన్స్ ఎంతగానో ఎదరు చూస్తున్నాడు. యాక్షన్ బ్యాక్ డ్రాప్ లో..శైలేష్ కొలను ఈసినిమాను డైరెక్ట్ చేస్తున్నాడు. అంతే కాదుకెరియర్ పరంగా ఇది వెంకటేశ్ కి 75వ సినిమా. ఇక వెంకటేష్ తన 76వ సినిమాను కూడా లైన్ చేసుకున్నట్టు తెలుస్తోంది. టాలీవుడ్ లో యాక్షన్ సినిమాల దర్శకుడిగా పేరు ఉన్న  సురేందర్ రెడ్డి ఒక కథ చెప్పడం .. యాక్షన్ - ఫ్యామిలీ ఎమోషన్స్ నేపథ్యంతో కూడిన ఆ కథ వెంకటేశ్ కి నచ్చడం జరిగిపోయిందని అంటున్నారు.  
 
హీరోలను బాగా ఎలివేట్ చేస్తుంటాడు సురేందర్ రెడ్డి. ఆయన  మేకింగ్ చాలా స్టైలీష్ గా ఉంటుంది. యాక్షన్ సీన్స్ పై ఆయన మార్కు ప్రత్యక్షంగా కనిపిస్తూ ఉంటుంది. అంతే కాదు.. అప్పటి వరకూ ఎలా ఉన్నా.. ఆయన సినిమాల తరువాత హీరోలు ఇంకా హ్యాండ్సమ్ గా తాయారువతారు అన్న  పేరు ఉంది. రామ్ చరణ్, బన్నీ, అఖిల్ లాంటి హీరోలు సురేందర్ రెడ్డి సినిమాల్లో.. ఇంకాస్త ఎక్కువ హ్యాండ్సమ్ గా కనిపించడం మనం చూశాం. 

ఇక ఇప్పుడు వెంకటేష్ , సురేందర్ రెడ్డి  కాంబినేషన్లోని ప్రాజెక్టుకి సంబంధించిన సన్నాహాలు మొదలయ్యాయని చెబుతున్నారు. త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడనుందని అంటున్నారు. 'సైరా' .. 'ఏజెంట్' ఫ్లాపుల తరువాత సురేందర్ రెడ్డి చేస్తున్న ఈ సినిమా, ఆయనకి చాలా కీలకమైనదేనని చెప్పాలి. మరి ఈసారి విక్టరీ స్టార్ తో..విక్టరీ కొడతాడా లేక.. వెంకీకి కూడా ప్లాప్ అంటగడతాడాఅనేది చూడాలి. 

Follow Us:
Download App:
  • android
  • ios