లారెన్స్ తో కలిసి స్టెప్పులేసిన విక్టరీ వెంకటేష్, తన ఎవర్ గ్రీన్ సాంగ్ తో అదరగొట్టిన సీనియర్ హీరో..?
కోలీవుడ్ స్టార్ లాఘవ లారెన్స్ తో కలిసి అదిరిపోయే స్టెప్పులేశారు.. టాలీవుడ్ సీనియర్ హీరో విక్టరీ వెంకటేష్. జిగర్తాండ డబల్ ఎక్స్ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో అదరగొట్టాడు సీనియర్ హీరో.

ఎప్పుడో 26ఏళ్ళ క్రితం వచ్చి..తన సినిమాలోని సూపర్ హిట్ సాంగ్ కు..అదే జోరుతో..సూపర్ స్టెప్పు లేశాడు విక్టరీ స్టార్ వెంకటేష్.సౌత్ స్టార్ కొరియోగ్రాఫర్ రాఘవ లారెన్స్ తో కలిసి డాన్స్ చేశారు సీనియర్ హీరో. అయితే జిగర్తాండ డబుల్ ఎక్స్ మూవీ ప్రీరిలీజ్ ఈవెంట్ ఇందుకు వేదిక అయ్యింది. హీరో విక్టరీ వెంకటేష్.. జిగర్తాండ డబల్ ఎక్స్’తెలుగు ప్రీ రిలీజ్ ఈవెంట్ లో పాల్గొన్నారు. కార్తీక్ సుబ్బరాజు దర్శకత్వంలో రాఘవ లారెన్స్, SJ సూర్య మెయిన్ లీడ్స్ లో గతంలో వచ్చింది జిగర్తాండ సినిమా. ఈసినిమాకు సీక్వెల్ గా జిగర్తాండ డబల్ ఎక్స్ తెరకెక్కింది.
ఈ సినిమా దీపావళి కానుకగా నవంబర్ 10న రిలీజ్ కానుంది. ఈ సినిమా తెలుగులో కూడా రిలీజ్ అవుతుండటంతో.. ఇక్కడ కూడా ప్రమోషన్స్ భారీగా చేస్తున్నారు టీమ్. అందులో భాగంగా తెలుగులో నిన్న రాత్రి నిర్వహించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ వేడుకకు వెంకటేష్ ముఖ్య అతిధిగా వచ్చారు. ఈ సందర్భంగా లారెన్స్ వెంకటేష్ చేత స్టెప్పులేయించారు. రాఘవ లారెన్స్, వెంకటేష్ కలిసి ప్రేమించుకుందాం రా సినిమాలోని పెళ్లి కల వచ్చేసింది బాల.. పాటకు కాలు కదిపారు.
వెంకటేష్ ఈవెంట్ కి రాగా వెంటనే ఈ పాట ప్లే చేశారు. దీంతో అప్పట్లో ఈ పాటకు స్టెప్పులు కంపోజ్ చేసిన లారెన్స్ డ్యాన్స్ వేస్తూ వెంకటేష్ ని కూడా రావల్సిందిగా రిక్వెస్ట్ చేశారు. దాంతో వెంకీ కూడా రాఘవతో కలిసి తన సిగ్నేచర్ స్టెప్ వేశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అంతే కాదు వెంకీమామ ఫ్యాన్స్ ఈ వీడియో చూసి దిల్ ఖుష్ అవుతున్నారు. తమ హీరో మళ్లీ ఇలా యాక్టీవగా ఉండటం వారికి ఎంతో సంతోష పెట్టింది.
60 ఏళ్లు దాటిన..యంగ్ హీరోలకంటే ఎక్కువ సక్సెస్ రేట్ తో దూసుకుపోతున్నాడు విక్టరీ వెంకటేష్. తన వయస్సుకు తగ్గ పాత్రలు ఎంచుకుంటూ.. దూసుకుపోతున్నాడు. వరుసగా దృశ్యం2, ఎఫ్3 లాంటి హిట్లు కొట్టాడు వెంకటేష్. అంతే కాదు రానాతో కలిసి రానా నాయుడు వెబ్ సిరీస్ లో కూడా నటించారు. అయితే ఈ వెబ్ సిరీస్ మాత్రం వెంకీని విమర్శల పాలు చేసింది. అదల్ట్ కంటెంట్ ఎక్కువగా ఉండటం. ఫ్యామిలీ హీరో అయిన వెంకటేష్ నోటివెంట వచ్చి బూతులు ఆడియన్స్ యాక్సెప్ట్ చేయలేకపోయారు.