ఓ హిట్టు సినిమాతో టాలీవుడ్ కి పరిచయమైంది ఓ పంజాబీ ముద్దుగుమ్మ. ఆ తరువాత ఆమె నటించిన సినిమాలు ఫ్లాప్ లు అయ్యాయి. మధ్యలో ఒక హిట్ వచ్చినా.. అమ్మడు కొంచెం బొద్దుగా ఉందనే కామెంట్స్ వినిపించాయి. ఇండస్ట్రీలో ఆమె కంటే టాలెంటెడ్ హీరోయిన్లు ఎంతమంది ఉన్నా.. వరుసగా మూడు ఫ్లాప్స్ ఇచ్చిన ఈ బ్యూటీనే తమ సినిమాల్లో హీరోయిన్ గా ఎంపిక చేసుకుంటున్నారు దర్శకనిర్మాతలు.

దాదాపు యంగ్ హీరోలందరి సరసన నటిస్తూ బిజీగా గడుపుతోంది ఈ బ్యూటీ. సాధారణంగా ఫ్లాప్ హీరోయిన్లను మన మేకర్స్ పెద్దగా పట్టించుకోరు. కానీ ఈ భామకు వరుస అవకాశాలు రావడం వెనుక ఓ సీనియర్ హీరో సపోర్ట్ ఉందని అంటున్నారు. గతంలో ఈ ముద్దుగుమ్మ సదరు సీనియర్ హీరోతో ఓ సినిమాలో కూడా నటించింది. ఆ సినిమా ఓ మోస్తరు విజయాన్ని అందుకుంది.

ఈ యంగ్ హీరోయిన్ పై సీనియర్ హీరోకి ఉన్న స్పెషల్ ఇంట్రెస్ట్ తోనే ఆమెకు అవకాశాలు వచ్చేలా చేస్తున్నాడని టాక్. ప్రస్తుతానికి ఈ సీనియర్ హీరో ఓ ప్రముఖ బ్యానర్ నిర్మిస్తోన్న సినిమాలో హీరోగా నటిస్తున్నాడు. మరి ఇంకెంతకాలం ఈ బ్యూటీకి సీనియర్ హీరో సపోర్ట్ ఉంటుందో చూడాలి!