ఒకప్పుడు కమర్షియల్ హీరోయిన్ గానే కాకుండా లేడీ ఓరియెంటెడ్ సినిమాలు చేసి హీరోలతో సమానంగా మార్కెట్ రేంజ్ ని సంపాదించుకున్న నటి విజయశాంతి.. ఇప్పుడు సెకండ్ ఇన్నింగ్స్ కి సిద్ధమైంది. దాదాపు 13 ఏళ్లు సినిమా ఇండస్ట్రీలో దూరంగా ఉన్న ఈమె 'సరిలేరు నీకెవ్వరు' సినిమాతోరీఎంట్రీ ఇవ్వనుంది.

అయితే ఈ తరం హీరోయిన్లలో మీకు ఎవరంటే ఇష్టమని విజయశాంతిని ప్రశ్నించగా.. దానికి షాకింగ్ సమాధానం చెప్పింది. ఇప్పుడున్న వారిలో తనకు ఎవరూ నచ్చలేదని, ఎవరూ తనని ఇంప్రెస్ చేయలేకపోయారని చెప్పారు. సినిమా ఇండస్ట్రీలో ఎందఱో నటీమణులు ఉన్నారు కానీ ఎవరికీ పని మీద ఫోకస్ లేదని చెప్పారు. 

ఆరోజుల్లో తనలాంటి హీరోయిన్లు 24 నాలుగు గంటలూ పని చేస్తుండేవారని.. ఏడాదిలో ఒకేసారి 18 సినిమాలు చేసేవారని.. కానీ ఇప్పుడున్న వారు అలసిపోతారని ఏడాదికి రెండు, మూడు సినిమాలు మాత్రమే చేస్తున్నారని కామెంట్స్ చేసింది. కష్టం అనే పదానికి అప్పటికి ఇప్పటికి చాలా తేడా ఉందని విజయశాంతి అన్నారు.

ఇప్పటి నటీమణులు చేస్తున్న సినిమాల్లో తనను ఏవీ ఇంప్రెస్ చేయలేదని చెప్పుకొచ్చింది. ఇక సినిమా టెక్నాలజీ గురించి మాట్లాడుతూ.. అప్పటికి ఇప్పటికీ చాలా డిఫరెన్స్ ఉందని చెప్పింది.

ఎన్టీఆర్, కృష్ణలాంటి స్టార్ హీరోలు ఇరవై రోజుల్లో సినిమా షూటింగ్‌లు పూర్తి చేసేసేవారని.. కానీ ఈ మోడ్రన్ యుగంలో దర్శక, నిర్మాతలు ఎంపిక చేసుకునే కథలు, వాటి నేపథ్యం భారీతనంతో ఉంటుండడంతో సింపుల్ సినిమాలను పూర్తి చేయడానికి 100 రోజులకు పైగా సమయం పడుతోందని చెప్పుకొచ్చారు.