మొదటి భర్తతో డివోర్స్ కు ప్రధాన కారణం.. షాకింగ్ విషయాలు చెప్పిన సీనియర్ నటి ఊర్వశి!
హీరోయిన్ గా కొన్నాళ్ల పాటు అలరించిన సీనియర్ నటి ఊర్వశీ ప్రస్తుతం క్యారెక్టర్ ఆరిస్టుగా అలరిస్తోంది. వందల సినిమాల్లో నటించిన ఆమె.. తాజాగా తన పర్సనల్ లైఫ్ గురించి మాట్లాడారు. మొదటి భర్తతో విడిపోవడానికి కారణాలను వెల్లడించారు.
సీనియర్ నటి ఊర్వశీ (Urvashi) చైల్డ్ ఆర్టిస్గ్ గానే కెరీర్ ను ప్రారంభించింది. మలయాళం, తమిళం, తెలుగు, కన్నడ భాషల్లో ఇప్పటి వరకు 700కు పైగా సినిమాలు చేశారు. ప్రస్తుతం క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా అలరిస్తున్న ఆమె... కేరీర్ ప్రారంభంలో హీరోయిన్ గానూ చాలా సినిమాలు చేశారు. దక్షిణాది అగ్రస్థాయి హీరోల సరసన నటించి మెప్పించారు. తెలుగులో చిరంజీవి, బాలకృష్ణ వంటి హీరోలకు జంటగా నటించి ప్రేక్షకులను ఆకట్టుకుంది. ప్రస్తుతం సెకండ్ ఇన్సింగ్ నూ జోరుగా కొనసాగిస్తోంది. కీలక పాత్రల్లో నటిస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది.
తాజాగా ఊర్వశీ తన పర్సనల్ లైఫ్ పై ఓ ఇంటర్వ్యూలో షాకింగ్ కామెంట్స్ చేసింది. ఊర్వశీ 1984 నుంచి హీరోయిన్ గా వెండితెరపై అలరించింది. కెరీర్ జోరుమీద ఉన్న దశలోనే ఆమె పెళ్లి పీటలు ఎక్కింది. 2000 సంవత్సరంలో ఊర్వశీ నటుడు మనోజ్ కే జయన్ ను పెళ్లి చేసుకుంది. వీరిద్దరికి తేజ లక్ష్మి అనే కూతురు జన్మించింది. అయితే, పెళ్లైన 8 ఏళ్లకే వీరద్దరూ విడిపోవడం గమనార్హం. ఆ మధ్య సమయంలోనూ వీరి దాంపత్య జీవితం సజావుగా సాగలేదంట. ఈక్రమంలో ఊర్వశీ చెన్నైకి చెందిన శివ ప్రసాద్ ను 2013లో పెళ్లి చేసుకుంది. వీరికి కొడుకు పుట్టాడు. పేరు ఇషాన్ ప్రజాపతి. ఇక మనోజ్ కూడా రెండో పెళ్లి చేసుకొన్నారు.
ఇదిలా ఉంటే.. తన మొదటి భర్తతో ఉర్వశీ విడిపోవడానికి కారణం ఏంటనేది ఇప్పటికీ స్పష్టం తెలియలేదు. దీనిపై తాజాగా ఆమె ఓ ఇంటర్వ్యూలో మాట్లాడినట్టు, పలు కారణాలను తెలిపినట్టు న్యూస్ వైరల్ గా మారింది. దాని ప్రకారం.. వీరిద్దరూ విడిపోవడానికి ప్రధాన కారణం తాగుడు అలవాటేనని తెలిపారు. వారింట్లో అందరూ మందు తాగుతారని, కుటుంబంతో కలిసి మద్యం సేవిస్తారని చెప్పారు. అదీగాక తనను తాగమని బలవంతం చేసేవాడంట మనోజ్. దాంతో క్రమంగా ఊర్వశీ కూడా తాగుబోతుగా మారిపోయారని చెప్పింది. అలా మందుకూ బానిసైపోయిందంట. దాంతోనే ఘర్షణలు జరిగి విషయం విడాకుల వరకు వచ్చిందని తెలిపింది.
విడాకుల తర్వాత తను మందుకు బానిసయ్యానని చెప్పి తన కూతుర్ని కూడా తనకు కాకుండా చేశారని ఆవేదన వ్యక్తం చేసింది. దాంతో డిప్రెషన్ లోకి వెళ్లిందంట. కొన్నేళ్లు ఆ బాధలోనే కులిమిలిపోయిందని చెప్పింది. కొద్దిరోజులకు ఫ్యామిలీ ఫ్రెండ్ సలహాతో శివప్రసాద్ ను రెండో వివాహం చేసుకున్నట్టు వివరించింది. సెకండ్ మ్యారేజ్ చేసుకునే సమయంలో తన వయస్సు 40 ఏళ్లు ఉంటుందని చెప్పింది. ప్రస్తుతం భర్త, కొడుకుతో సంతోషంగా ఉన్నట్టు వెల్లడించింది. వెండితెరపై ఎంతో హ్యాపీగా, సరదగా కనిపించే ఊర్వశీ జీవితంలో ఇంతటి బాధాకరమైన ఘటన ఉండటంతో అభిమానులు షాక్ అవుతున్నారు.