హీరోయిన్ గా వెండితెరకు పరిచయమైన నటీమణులు వయసు పై బడిన అనంతరం సెకండ్ ఇన్నింగ్స్ ను ఏ విధంగా స్టార్ట్ చేస్తారో తెలిసిందే. వదినగా అక్కగా అలాగే అందమైన అత్త పాత్రలో కనిపిస్తుంటారు. ఇక ఆ తరువాత కూడా ఇండస్ట్రీలో కొనసాగితే తల్లి పాత్రలతో మెప్పిస్తుంటారు. 

ప్రస్తుతం లక్ష్మి కూడా జనరేషన్స్ మారుతున్న కొద్దీ సరికొత్త తరహాలో అడుగులు వేస్తున్నారు. చాలా కాలం తరువాత ఆమె మళ్ళీ సౌత్ లో బిజీగా మారారు. ముఖ్యంగా టాలీవుడ్ లో గ్యాప్ లేకుండా అవకాశాలు అందుకుంటున్నారు. రీసెంట్ గా ఓ బేబీ సినిమాలో బామ్మగా కనిపించి మెప్పించిన లక్ష్మి నెక్స్ట్ కూడా మళ్ళీ అలాంటి పాత్రల్లోనే దర్శనమివ్వనున్నారు. 

66 ఏళ్ల లక్ష్మి ప్రస్తుతం నాని గ్యాంగ్ లీడర్ సినిమాతో బిజీగా ఉన్నారు. మన్మథుడు 2లో కూడా ఆమె నటిస్తున్నారు. ఆ సినిమాలు వచ్చే నెల రిలీజ్ కానున్నాయి. ఓ బేబీ సక్సెస్ తో లక్ష్మికి టాలీవుడ్ లోనే కాకుండా కోలీవుడ్ లో కూడా పలు ఆఫర్లు వస్తున్నట్లు సమాచారం. ఏదేమైనా ఫస్ట్ ఇన్నింగ్స్ లోనే కాకుండా సెకండ్  అండ్ థర్డ్ ఇన్నింగ్స్ లో కూడా లక్ష్మి వెండితెరపై మంచి ఎనర్జీతో కనిపిస్తున్నారు.