సీనియర్ నటి కస్తూరి శంకర్ ప్రాణాంతక వ్యాధి బారిన పడ్డారట. ఆ విషయం తెలియజేస్తూ సోషల్ మీడియా పోస్ట్ పెట్టారు.
సీనియర్ నటి కస్తూరి శంకర్ తెలుగు ప్రేక్షకులకు సుపరిచితురాలే. చిరంజీవి లేటెస్ట్ మూవీ గాడ్ ఫాదర్ లో ఆమె ఓ కీలక రోల్ చేశారు. స్టార్ మా లో ప్రసారం అవుతున్న ఇంటింటి గృహలక్ష్మి సీరియల్ లో ప్రధాన పాత్ర చేస్తున్నారు. చెన్నైలో ఉండే కస్తూరి అనారోగ్యం బారినపడ్డారు. ఆమెకు చికెన్ ఫాక్స్ సోకిందట. ఈ విషయం తెలియజేస్తూ కస్తూరి సోషల్ మీడియా పోస్ట్ పెట్టారు.
నాకు చికెన్ పాక్స్ సోకింది. ఈ చెడ్డ వ్యాధి ఒక్కోసారి ప్రాణాలు తీస్తుంది. అలాగే అందవిహీనంగా మార్చేస్తుంది. అదృష్టవశాత్తు నాకు ఏమీ కాలేదు. మీ అందరి ప్రేమాభిమానాలకు కృతజ్ఞతలు. నాకు అండగా నిలబడ్డారు. అంటూ ఆమె కామెంట్స్ పెట్టారు. చికెన్ పాక్స్ సోకినట్లు ఆనవాళ్లు చూపుతూ కొన్ని ఫోటోలు షేర్ చేశారు. అభిమానులు కస్తూరి పోస్ట్ పై స్పందించారు. ఆమె అనారోగ్యం నుండి కోలుకోవాలని కామెంట్స్ పెడుతున్నారు. ప్రార్ధనలు చేస్తున్నారు.
కస్తూరి చాలా కాలంగా పరిశ్రమలో ఉన్నారు. తమిళ, తెలుగు, మలయాళ, కన్నడ భాషల్లో అనేక చిత్రాల్లో నటించారు. 1991లో విడుదలైన ఆత ఉన్ కోయిలీలే మూవీతో సిల్వర్ స్క్రీన్ కి పరిచయమయ్యారు. మూడు దశాబ్దాల కెరీర్లో సినిమాలు, సీరియల్స్, వెబ్ సిరీస్లు చేశారు. కస్తూరి నటించిన పరంపర వెబ్ సిరీస్ హాట్ స్టార్ లో ప్రసారం అవుతుంది. కస్తూరి 2000లో రవి కుమార్ అనే డాక్టర్ ని వివాహం చేసుకున్నారు. వీరికి అమ్మాయి,అబ్బాయి సంతానం. కూతురు క్యాన్సర్ బారిన పడి కోలుకున్నారు.
