సీనియర్ నటితో యంగ్ హీరో ఎఫైర్.. సపోర్ట్ కోసమేనా..?

senior actress  affair with a young hero
Highlights

ప్రేమ, పెళ్లి అయితే ఓకే.. కానీ ఇండస్ట్రీలో ఓ యువ నటుడు మాత్రం పెద్ద కుటుంబానికి చెందిన అమ్మాయితో సన్నిహితంగా మెలగడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది

సినిమా ఇండస్ట్రీలో అవకాశాల కోసం కాంప్రమైజ్ అవుతున్నారనే విషయాలు గతంలో చాలానే విన్నాం. ఎక్కువగా అమ్మాయిల పేర్లే ఇందులో బయటకు వస్తుంటాయి. ఇదో రకమైతే.. కాస్త ఫేమ్, సపోర్ట్ కోసం బడా ఫ్యామిలీలకు చెందిన అమ్మాయిలతో హీరోలు సన్నిహితంగా మెలగడం ఇప్పుడు ట్రెండ్ అయింది. మొన్నామధ్య ఓ యంగ్ హీరో ఇండస్ట్రీకి చెందిన మెగా కుటుంబం నుండి అమ్మాయిని లైన్ లో పెట్టాడని, ఆమెను పెళ్లి కూడా చేసుకోబోతున్నాడని విన్నాం.

ప్రేమ, పెళ్లి అయితే ఓకే.. కానీ ఇండస్ట్రీలో ఓ యువ నటుడు మాత్రం పెద్ద కుటుంబానికి చెందిన అమ్మాయితో సన్నిహితంగా మెలగడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. సదరు అమ్మాయికి గతంలో పెళ్లి కూడా జరిగింది. కానీ భర్తతో విడాకులు తీసుకోవడం ఆ తరువాత అతడు చనిపోవడంతో ఆమె తన కుటుంబానికి చెందిన ప్రొడక్షన్ వ్యవహారాలు చూసుకుంటూ కాలం గడుపుతుంది. అయితే ఆమె కూడా ఈ యంగ్ హీరో స్నేహాన్ని కోరుకుంటోంది. అలాగని ఇద్దరి మధ్య ఉన్నది స్నేహం అనుకుంటే పొరపాటే..

ఆమె మీద ఇష్టంతో ఈ హీరో గారు ప్రత్యేకంగా ఒక క్యారెక్టర్ ను రాసి సినిమాలో ఆఫర్ కూడా ఇచ్చాడు. ఈ సినిమాతోనే రీసెంట్ గా ఆమె తన సెకండ్ ఇన్నింగ్స్ మొదలుపెట్టింది. ఇందులో హీరోగా నటించింది కూడా అతడే. తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా మంచి రెస్పాన్స్ ను దక్కించుకుంటోంది. ఈ యంగ్ హీరోకి సపోర్ట్ గా నిలుస్తోన్న ఈ సీనియర్ ఆర్టిస్ట్ త్వరలోనే తన ఫ్యామిలీకి చెందిన ప్రొడక్షన్ హౌస్ లో ఈ హీరోతో ఓ సినిమా నిర్మించాలనుకుంటుందని టాక్. మరి ఈ వ్యవహారం ఇంకెక్కడ వరకు వెళ్తుందో చూడాలి!

loader