చిత్ర పరిశ్రమలో తీవ్ర విషాదం నెలకొంది. సీనియర్ నటుడు శరత్ బాబు (Sarath Babu) కన్నుమూశారు. తీవ్ర అస్వస్థతతో గత కొద్ది కాలంగా హాస్పిటల్ లో ట్రీట్మెంట్ తీసుకుంటున్న ఆయన కొద్దిసేపటి క్రితమే కన్నుమూశారు.
చిత్ర పరిశ్రమలో విషాదం ఘనలు జరుగుతూనే ఉన్నాయి. గతేడాది సినీ దిగ్గజాలను కోల్పోయిన విషయం తెలిసిందే. ఈ ఏడాది కూడా సినీయర్ నటులు ఒక్కొక్కరు ప్రాణాలు కోల్పోతున్నారు. తాజాగా సీనియర్ నటుడు శరత్ బాబు (Sarath Babu) కన్నుమూశారు. ఆయన 71వ ఏట తుదిశ్వాస విడిచారు. కొంత కాలం కింద ఆస్పత్రిలో చేరిన ఆయన చికిత్స పొందుతూ పరిస్థితి విషయమించడంతో ప్రాణాలు వదిలారు. శరత్ బాబు అసలు పేరు సత్యంబాబు దీక్షితులు. ఆయన 1952 జులై 31వ తేదీన జన్మించారు. ఆయన చివరగా నటించిన చిత్రం మళ్లీ పెళ్లి.
కొంత కాలం క్రితం అనారోగ్యానికి గురైన శరత్ బాబు.. చెన్నైలోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందారు. ఇటీవల ఆరోగ్యం మళ్లీ దెబ్బతినడంతో మెరుగైన చికిత్స కోసం బెంగళూరు తరలించారు. అక్కడ కూడా ఆరోగ్యం మెరుగుపడకపోవడంతో.. ఏప్రిల్ 20న హైదరాబ్ లోని గచ్చిబౌలి ఏఐజీ ఆస్పత్రికి తీసుకొచ్చారు. అక్కడ కొన్ని రోజులు చికిత్స అందించిన వైద్యులు శరీరం మొత్తం ఇన్ఫెక్షన్ వ్యాపించిందని తేల్చారు. అది మల్టీ ఆర్గాన్ ఫెల్యూర్ కు దారి తీయొచ్చని తెలిపారు . వెంటిలేటర్ పైనే చికిత్స అందించారు. చివరి పరిస్థితి విషయమించి మరణించారు.
ఆంధ్రప్రదేశ్ లోని శ్రీకాకుళం జిల్లా ఆముదాలవలసలో 1951 జూలై 31న శరత్ బాబు జన్మించారు. తన 22వ ఏట 1973లోనే నటుడిగా మారారు. రామరాజ్యం అనే చిత్రంలో తొలిసారి నటించారు. మూడుముళ్ల బంధం, సీతాకోక చిలుక, సంసారం ఒక చదరంగం, అన్నయ్య , ఆపద్భాంధవుడు ఇలా ఎన్నో అద్భుతమైన చిత్రాల్లో శరత్ బాబు నటించారు. తెలుగు, తమిళ, మలయాళం, కన్నడతో పాటు హిందీ చిత్రాల్లోనూ నటించి మెప్పించిచారు. హీరోగానే కాకుండా క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా వందలాది చిత్రాల్లో నటించారు. నెగిటివ్ రోల్స్ లో సైతం ఆయన మెప్పించారు. శరత్ బాబు మొత్తంగా 200 చిత్రాలకు పైగా నటించారు.
గతేడాది క్రిష్ణంరాజు, క్రిష్ణ, కైకాల సత్యనారాయణ, చలపతిరావు తో పాటు ప్రముఖులు కన్నుమూసిన విషయం తెలిసిందే. ఈ ఏడాది ప్రారంభం నుంచే విషాద ఘటనలు జరుగుతున్నాయి. కళా తపస్వీ కే విశ్వనాథ్, గాయని వాణీ జయరాం, సీనియర్ నటి నటి జమున, నందమూరి తారకరత్న తిరిగిరాని లోకాలకు వెళ్లిన విషయం తెలిసిందే. ఇక తాజాగా శరత్ బాబు కూడా కన్నుమూయడంతో సినీ ప్రముఖులు దిగ్భ్రాంతికి గురవుతున్నారు.
