అప్పుడు ఎన్టీఆర్ కి, ఇప్పుడు రాంచరణ్ కి.. ఊహించని షాకిచ్చిన సీనియర్ నటుడు

డైరెక్టర్ బుచ్చిబాబు ఈ చిత్రం కోసం పీపుల్స్ స్టార్ ఆర్ నారాయణ మూర్తిని సంప్రదించారట. అది ఎంతో కీలకమైన పాత్ర అని.. నారాయణ మూర్తి గారు అయితే పర్ఫెక్ట్ అని వెళ్లి కలిశారట.

Senior actor R Narayana Murthy gives shock to Ram Charan dtr

మెగా పవర్ స్టార్ రాంచరణ్, బుచ్చిబాబు కాంబినేషన్ లో తెరకెక్కబోయే చిత్రం గురించి రోజుకొక రూమర్ పుట్టుకొస్తోంది. చిత్ర యూనిట్ నుంచి మాత్రం ఎలాంటి క్లారిటీ రావడం లేదు. ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాల్లో వారంతా బిజీ బిజీగా గడుపుతున్నారు. 

కానీ లెక్కలేనన్ని రూమర్స్ మాత్రం పుట్టుకొచ్చేస్తున్నాయి. ఈ చిత్రంలో నటించే నటీనటుల విషయంలో రోజుకొక పేరు వినిపిస్తోంది. డైరెక్టర్ బుచ్చిబాబు ఉత్తరాంధ్ర నేపథ్యంలో పీరియాడిక్ డ్రామాగా ఈ చిత్రాన్ని తెరకెక్కించేందుకు ప్రయత్నిస్తున్నారు. 400 కోట్ల భారీ బడ్జెట్ లో ఈ చిత్రం తెరకెక్కనున్నట్లు తెలుస్తోంది. 

తాజాగా ఇండస్ట్రీ వర్గాల నుంచి అందుతున్న సమాచారం మేరకు.. డైరెక్టర్ బుచ్చిబాబు ఈ చిత్రం కోసం పీపుల్స్ స్టార్ ఆర్ నారాయణ మూర్తిని సంప్రదించారట. అది ఎంతో కీలకమైన పాత్ర అని.. నారాయణ మూర్తి గారు అయితే పర్ఫెక్ట్ అని వెళ్లి కలిశారట. కానీ నారాయణ మూర్తి ఒప్పుకుంటే ఆశ్చర్యం కానీ.. ఒప్పుకోకపోవడంలో సర్ప్రైజ్ ఏమి లేదు. ఆయన బుచ్చిబాబు ఆఫర్ ని సున్నితంగా తిరస్కరించినట్లు తెలుస్తోంది. 

Senior actor R Narayana Murthy gives shock to Ram Charan dtr

ఆర్ నారాయణ మూర్తి ఎప్పుడూ క్యారెక్టర్ రోల్స్ చేయలేదు. గతంలో ఎన్టీఆర్ టెంపర్ చిత్రం కోసం కూడా పూరి జగన్నాధ్.. నారాయణ మూర్తిని బ్రతిమాలారు. కానీ ఆయన అంగీకరించలేదు. చివరికి ఆ పాత్ర పోసాని కృష్ణమురళికి వెళ్ళింది. ఇప్పుడు రాంచరణ్ చిత్రానికి కూడా నారాయణమూర్తి ఒప్పుకోలేదు అని వార్తలు వస్తున్నాయి. మరి బుచ్చిబాబు సెకండ్ ఆప్షన్ ఎవరో చూడాలి. 

గేమ్ ఛేంజర్ చిత్రం ముగిసిన వెంటనే ఈ చిత్ర షూటింగ్ మొదలవుతుంది. ఇప్పటికే ఈ చిత్రానికి ఏఆర్ రెహమాన్ సంగీత దర్శకుడిగా ఫిక్సయ్యారు. మైత్రి మూవీ మేకర్స్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios