సీనియర్ నటుడు పృధ్వీరాజ్ తెలుగులో హీరోగా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గానే కాకుండా నెగెటివ్ షేడ్స్ ఉన్న పాత్రల్లో కూడా కనిపించి మెప్పించారు. తెలుగులో ఒక టైంలో బిజీ యాక్టర్ గా కొనసాగాడు. అయితే అతడి నటన హీరోలను డామినేట్ చేసే విధంగా ఉందని ప్రచారం చేయడంతో అవకాశాలు తగ్గాయని, చాలా సినిమాల్లో తను నటించిన సన్నివేశాలకు కత్తెర పడిందని ఆవేదన వ్యక్తం చేశారు.

అలాంటి సమయంలో కోలివుడ్ కి వెళ్లి అక్కడ సినిమాలు చేసినట్లు గుర్తు చేసుకున్నారు. ఇప్పుడు మళ్లీ తెలుగులో మంచి అవకాశాలు వస్తున్నాయని చెప్పారు. నటుడిగా కొనసాగుతున్న సమయంలో కొన్ని వ్యాపారాలు చేశాడట పృధ్వీ. కానీ వాటి వల్ల నష్టాలు వచ్చాయని, వ్యాపారం అచ్చి రావడం లేదని, నటనపైనే దృష్టి పెట్టినట్లు తెలిపాడు.

వరుసగా సినిమాలు చేస్తోన్న సమయంలో రెమ్యునరేషన్ రూపంలో రూ.10 లక్షలు రావడంతో, మంచి ప్రాపర్టీ కొనాలని అనుకున్నారట. ఆ సమయంలో  తెలిసిన వ్యక్తి హైదరాబాద్ లో వంద ఎకరాల స్థలం అమ్మకానికి ఉందని తీసుకెళ్లారట. పది లక్షలకు వంద ఎకరాలు వస్తుండడంతో కొనాలని  నిర్ణయించుకున్నారట.

కానీ తన డ్రైవర్ ఇది మొత్తం రాతి నేల అని కొనడానికి పది లక్షలు, ఫెన్సింగ్ మరో ఇరవై లక్షలు అవుతుందని.. ఈ ల్యాండ్ ని మైంటైన్ చేయడం రిస్క్ అని చెప్పడంతో డ్రాప్ అయిపోయాడట పృధ్వీ. అదే ఇప్పుడున్న శంషాబాద్ ఏరియా అంటూ వెల్లడించాడు. ఆ విధంగా కోట్లు నష్టపోయినట్లు తెలిపాడు.