ప్రస్తుత మా అధ్యక్షు నరేశ్ మీడియా ముందుకు వచ్చారు. మంచు విష్ణుకు తాను సంపూర్ణ మద్ధతు తెలియజేస్తున్నట్లు తెలిపారు. మా పనితీరు మెరుగుపరడచానికి తాము కృషి చేశామన్నారు. వెల్ఫేర్ కమిటీని విజయవంతంగా నిర్వహించామని.. ఇంతకన్నా ఎవరైనా వెల్ఫేర్‌లో చేయగలరా అని నరేశ్ ప్రశ్నించారు

మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికలు హాట్ హాట్‌గా మారిన సంగతి తెలిసిందే. ఎన్నికలు సమీపిస్తుండటంతో అధ్యక్ష బరిలో నిలిచిన వారు ప్రెస్‌మీట్‌లు పెట్టి మరింత వేడి రాజేస్తున్నారు. మంచు విష్ణు, ప్రకాశ్ రాజ్‌ల ప్యానెల్‌లు అక్టోబర్ 10న జరిగే ఎన్నికల్లో తలపడనున్నాయి. ఈ నేపథ్యంలో ప్రస్తుత మా అధ్యక్షు నరేశ్ మీడియా ముందుకు వచ్చారు. మంచు విష్ణుకు తాను సంపూర్ణ మద్ధతు తెలియజేస్తున్నట్లు తెలిపారు. మా పనితీరు మెరుగుపరడచానికి తాము కృషి చేశామన్నారు. వెల్ఫేర్ కమిటీని విజయవంతంగా నిర్వహించామని.. ఇంతకన్నా ఎవరైనా వెల్ఫేర్‌లో చేయగలరా అని నరేశ్ ప్రశ్నించారు.

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred

‘‘మా’’ ఎప్పుడు మసకబారలేదని.. మా లో ఓ గ్రూపు అబద్ధపు ప్రచారం చేసిందని నరేశ్ ఆరోపించారు. రెండేళ్ల పాటు డైరీ కూడా విడుదల చేయకుండా ఇబ్బంది పెట్టారని ఆయన మండిపడ్డారు. కరోనా సమయంలో రూ.కోటి ఫండింగ్ సమకూర్చామన్నారు. మంచి వారసుడిని మాకు అందిస్తామన్న నరేశ్.. అందుకే మంచు విష్ణుకి మద్ధతు ఇస్తున్నట్లు తెలిపారు. ఎవరు పడితే వారు మా సీటులో కూర్చుంటే పదవి మసకబారుతుందని ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. సేవా రాజకీయం, శవ రాజకీయం రెండున్నాయని.. నాకు సేవ రాజకీయం మాత్రమే తెలుసునని నరేశ్ తెలిపారు. తాను మాలో శవ రాజకీయం కూడా చూశానని.. భవనం కట్టాలని అందరూ డిమాండ్ చేస్తున్నారని చెప్పారు. భవనం కంటే కరోనా సమయంలో ఆర్టిస్టుల ప్రాణాలే ముఖ్యమని నరేశ్ పేర్కొన్నారు