MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • Chennai Love Story 10 Days Collections: ఆదివారం కలెక్షన్లు డబుల్‌.. బాక్సాఫీసు వద్ద చైన్నై లవ్‌ స్టోరీ రచ్చ

Chennai Love Story 10 Days Collections: ఆదివారం కలెక్షన్లు డబుల్‌.. బాక్సాఫీసు వద్ద చైన్నై లవ్‌ స్టోరీ రచ్చ

కిరణ్‌ అబ్బవరం మరో హిట్‌ కొట్టాడు. `చెన్నై లవ్‌ స్టోరీ`తో బ్లాక్‌ బస్టర్‌ అందుకున్నాడు. ఈ చిత్రం పది రోజులు పూర్తి చేసుకున్నారు. ఆదివారం వసూళ్లు పెరగడం విశేషం. పది రోజుల్లో ఎంత రాబట్టిందంటే?

2 Min read
Author : Aithagoni Raju
Published : Aug 03 2026, 10:10 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
థియేటర్లో అలరిస్తోన్న చెన్నై లవ్‌ స్టోరీ
Image Credit : Asianet News

థియేటర్లో అలరిస్తోన్న చెన్నై లవ్‌ స్టోరీ

స్వచ్చమైన లవ్‌ స్టోరీస్‌ ఆదరణ పొందడం కష్టమవుతుంది. బోల్డ్ రొమాంటిక్‌ కథలకే ఆ ఆదరణ ఉంటుంది. ఇలాంటి టైమ్‌లో కిరణ్‌ అబ్బవరం ఒక ఫ్రెష్‌ అండ్‌ ఫీల్‌ గుడ్‌ ఎమోషనల్‌ లవ్‌ స్టోరీతో ఆడియెన్స్ ముందుకు వచ్చాడు. బ్లాక్‌ బస్టర్‌ కొట్టాడు. ఆయన `చెన్నై లవ్‌ స్టోరీ` చిత్రంలో నటించారు. ఇందులో శ్రీ గౌరీ ప్రియ హీరోయిన్‌గా నటించగా, రవి నంబూరి దర్శకత్వం వహించారు. సాయి రాజేష్‌ కథ అందించిన ఈ చిత్రాన్ని ఎస్‌కేఎన్‌, సాయి రాజేష్‌ నిర్మించారు. ఈ చిత్రం రెండు వారాల క్రితం(జులై 24న) ఆడియెన్స్ ముందుకు వచ్చింది. సినిమాకి అన్ని వర్గాల నుంచి పాజిటివ్‌ టాక్‌ వచ్చింది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24
కిరణ్‌ అబ్బవరం, గౌరీ ప్రియ నటన హైలైట్‌
Image Credit : Asianet News

కిరణ్‌ అబ్బవరం, గౌరీ ప్రియ నటన హైలైట్‌

`చెన్నై లవ్‌ స్టోరీ` ఒక ఫ్రెష్‌ లవ్‌ స్టోరీని సరికొత్తగా చూపించింది. స్క్రీన్‌ ప్లే మ్యాజిక్‌ చేస్తుందని చెప్పొచ్చు. హీరోయిన్‌ పాయింట్‌ ఆఫ్‌ వ్యూలో సాగే ప్రేమ కథలో శ్రీ గౌరీ ప్రియ ఇరగదీసింది. ఆమె నటనే సినిమాకి హైలైట్‌గా చెప్పొచ్చు. అదే స్థాయిలో కిరణ్‌ అబ్బవరం కూడా అదరగొట్టాడు. ఎమోషన్స్ పరంగా, ఎక్స్ ప్రెషన్స్ పరంగా వాహ్‌ అనిపించాడు. కొన్ని సీన్లలతో తన బెస్ట్ ఇచ్చాడు. నటుడిగా తనని తాను నిరూపించుకున్నాడు. అందరి చేత ప్రశంసలందుకున్నాడు. ఫస్టాఫ్‌ సినిమా అదిరిపోయింది. కానీ సెకండాఫ్‌ కొంత తగ్గింది. అది బ్యాలెన్స్ అయి ఉంటే సినిమా మరో స్థాయిలో ఉండేదని చెప్పొచ్చు.

Related Articles

Related image1
Dhandha Review: దందా రివ్యూ.. చిన్న మోసాల నుంచి పొలిటీషియన్స్ వరకు, నయా క్రైమ్‌ థ్రిల్లర్‌ ఎలా ఉందంటే?
Related image2
Chiranjeevi Hits: చిరంజీవికి అదృష్టం తెచ్చిన స్టార్ హీరోల భార్యలు, ఆ నాలుగు మామూలు బ్లాక్ బస్టర్లు కాదు
34
చెన్నై లవ్‌ స్టోరీ 10 రోజుల కలెక్షన్లు
Image Credit : Asianet News

చెన్నై లవ్‌ స్టోరీ 10 రోజుల కలెక్షన్లు

ఇక ఈ మూవీ పది రోజుల్లో ఎంత కలెక్ట్ చేసిందనేది చూస్తే, ఈ చిత్రానికి రెండు రోజుల క్రితమే యాభై కోట్లు కలెక్ట్ చేసినట్టు టీమ్‌ ప్రకటించింది. మరి శనివారం, ఆదివారం కలెక్షన్లు పెరిగాయి. ఆదివారం వీక్‌ డేస్‌తో పోల్చితే డబుల్‌ రావడం విశేషం. సాక్నిల్క్ సైట్‌ చెప్పిన లెక్కల ప్రకారం ఇది ఇప్పటి వరకు రూ.44.58 కోట్లు వసూలు చేసింది. ఆదివారం దీనికి ఊహించని విధంగా కలెక్షన్లు పెరిగాయి. ఏకంగా రూ.2.51కోట్లు రాబట్టడం విశేషం. ఇది కేవలం ఇండియాలోనే కావడం మరో విశేషం. ఇక రూ.37.88కోట్ల ఇండియా గ్రాస్‌, రూ.33కోట్ల నెట్‌ రాబట్టింది. ఓవర్సీస్‌లో దీనికి రూ.6.70కోట్లు వచ్చాయి. మొత్తంగా ఈ సినిమాకి సుమారు రూ.23కోట్ల షేర్‌ రావడం విశేషం.

44
కిరణ్‌ అబ్బవరం కెరీర్‌లోనే హైయ్యెస్ట్
Image Credit : Asianet News

కిరణ్‌ అబ్బవరం కెరీర్‌లోనే హైయ్యెస్ట్

`చెన్నై లవ్‌ స్టోరీ` చిత్రానికి ముప్పై కోట్ల బడ్జెట్‌ అయ్యిందని, రూ.16కోట్ల థియేట్రికల్‌ బిజినెస్‌గా లెక్కకట్టారు. దీంతో ఇది ఇప్పటికే బ్రేక్‌ ఈవెన్‌ దాటి లాభాల్లో వెళ్తుంది. ఇది ఈ వారం కూడా బాగానే ఆడే అవకాశం ఉంది. మరో ఐదారు కోట్లు రాబట్టే అవకాశాలున్నాయి. మొత్తంగా కిరణ్‌ అబ్బవరం కెరీర్‌లో ఈ చిత్రం బిగ్గెస్ట్ బ్లాక్‌ బస్టర్‌గా నిలవబోతుందని చెప్పొచ్చు.

About the Author

AR
Aithagoni Raju
అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్
వినోదం
Latest Videos
Recommended Stories
Recommended image1
OTT: అఖిల్ లెనిన్ తో పాటు రొమాంటిక్ సినిమాలు, థ్రిల్లర్స్ ఓటీటీలోకి ఎంట్రీ.. ఈ వారం అస్సలు మిస్ కావొద్దు
Recommended image2
Chiranjeevi Hits: చిరంజీవికి అదృష్టం తెచ్చిన స్టార్ హీరోల భార్యలు, ఆ నాలుగు మామూలు బ్లాక్ బస్టర్లు కాదు
Recommended image3
Salman Khan Fee: దిల్ రాజుతో సినిమా, సల్మాన్ ఖాన్ రెమ్యునరేషన్ లో భారీ కోత.. ఎందుకో తెలుసా
Related Stories
Recommended image1
Dhandha Review: దందా రివ్యూ.. చిన్న మోసాల నుంచి పొలిటీషియన్స్ వరకు, నయా క్రైమ్‌ థ్రిల్లర్‌ ఎలా ఉందంటే?
Recommended image2
Chiranjeevi Hits: చిరంజీవికి అదృష్టం తెచ్చిన స్టార్ హీరోల భార్యలు, ఆ నాలుగు మామూలు బ్లాక్ బస్టర్లు కాదు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved