ఆస్తి కోసం నన్నే చంపాలనుకుంది.. నా కొడుకు రమ్య దగ్గరొద్దు : కోర్టులో నరేష్ పిటిషన్

మూడో భార్య రమ్య రఘుపతిపై సంచలన ఆరోపణలు చేశారు నటుడు వీకే నరేష్. ఆస్తి కోసం తననే చంపాలనుకుందని, రమ్య రఘుపతి వల్ల తన కొడుకు భవిష్యత్ నాశనం అవుతుందని ఆరోపించారు. కొడుకు గార్డియన్‌గా తననే నియమించాలని కోర్టును కోరారు నరేష్

senior actor naresh moved to court for his son

కొడుకు గార్డియన్‌గా తననే నియమించాలని కోర్టును కోరారు నటుడు నరేష్. రమ్య రఘుపతి వల్ల తన కొడుకు భవిష్యత్ నాశనం అవుతుందని ఆరోపించారు. ఫైనాన్షియల్ స్కాములు చేసే రమ్య వద్ద తన కొడుకు వుండటం ప్రమాదకరమని కోర్టు దృష్టికి తీసుకెళ్లాడు. తన కుమారుడి చదువు కోసం ఏటా రూ.4 లక్షలు ఖర్చు పెడుతున్నానని చెప్పాడు. ఆస్తి కోసం భర్తనే చంపాలనుకున్న రమ్య దగ్గర తన కుమారుడిని వుంచొద్దని కోర్టును కోరారు నరేష్. 

అంతకుముందు ఆస్తి కోసం తనను చంపేందుకు  రమ్య ప్రయత్నించిందని  నరేష్  సంచలన ఆరోపణలు  చేశారు. ఈ విషయమై  నరేష్ కోర్టును ఆశ్రయించారు. రమ్య, రోహిత్ శెట్టితో  తనకు  ప్రాణహని ఉందని  నరేష్ ఆరోపించారు. 2022 ఏప్రిల్ మాసంలో  తన ఇంట్లోకి ఆగంతకులు  చొరబడ్డారని ఆయన ఆరోపించారు. ఈ విషయమై  తాను గచ్చిబౌలి పోలీసులకు కూడా ఫిర్యాదు చేసినట్టుగా నరేష్ చెప్పారు. 

రమ్యతో తాను  నరకయాతన  అనుభవించినట్టుగా  ఆయన  తెలిపారు. తనను చంపేస్తారనే భయంతో  ఒంటరిగా  ఎక్కడికి వెళ్లడం లేదని నరేష్ చెప్పారు. తన ఫోన్  ను  రమ్య  ఓ పోలీస్ అధికారి సహయంతో హ్యాక్ చేయించదని నరేష్ ఆరోపించారు.  తన ఫోన్ ను హ్యాక్ చేసి  తన  పర్సనల్ మేసేజ్ లు  చూసేదన్నారు. రమ్య వేధింపులు భరించలేకపోతున్నానన్నారు. తనకు  విడాకులు ఇప్పించాలని  కోరారు. 

ALso REad: నన్ను చంపే కుట్ర చేశారు: మూడో భార్య రమ్యపై నరేష్ సంచలన ఆరోపణలు

2010 మార్చి  3న  తనకు రమ్యతో  బెంగుళూరులో వివాహమైందని   నరేష్ చెబుతున్నారు. పెళ్లి సమయంలో  కట్నం కూడా తీసుకోలేదన్నారు. రమ్యకు  రూ. 30 లక్షల విలువైన బంగారు ఆబరణాలను తన తల్లి విజయ నిర్మల  చేయించిందని నరేష్ గుర్తు  చేస్తున్నారు. పెళ్లైన  కొద్ది నెలల నుండే   తనను రమ్య వేధింపులకు గురి చేసిందని ఆయన ఆరోపించారు. తమకు  2012లో  రణ్ వీర్ పుట్టినట్టుగా  నరేష్ చెప్పారు. తనకు తెలియకుండానే పలు బ్యాంకులు, కొందరి నుండి  రమ్య డబ్బులు తీసుకుందని  ఆరోపించారు.  

తన పేరు చెప్పి లక్షలు అప్పులు చేసిందన్నారు. రమ్య చేసిన అప్పుల్లో తాను  రూ.10 లక్షలు తీర్చినట్టుగా  చెప్పారు. తన కుటుంబ సభ్యుల నుండి  రూ.50 లక్షలు అప్పులు తీసుకుందని  కూడా  నరేష్ ఆరోపించారు. గత ఏడాదిలో  బెంగుళూరులోని ఓ హోటల్ లో  పవిత్ర లోకేష్  తో కలిసి నరేష్ ఉన్న సమయంలో రమ్య రఘుపతి  పోలీసులతో  కలిసి హోటల్ కు వచ్చింది. పవిత్ర లోకేష్, నరేష్ లపై రమ్య దాడికి ప్రయత్నించింది.ఈ సమయంలో  పోలీసులు  ఆమెను అడ్డుకున్నారు. 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios