Asianet News TeluguAsianet News Telugu

Mihir Kumar Das: సీనియర్ నటుడు అకాల మరణం... ప్రధాని దిగ్భ్రాంతి!

చిత్ర పరిశ్రమలో విషాదం చోటు చేసుకుంది. సీనియర్ యాక్టర్ మిహిర్ కుమార్ దాస్ అకాల మరణం పొందారు. మిహిర్ దాస్ మరణంపై వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు.

senior actor mihir kumar das passes away
Author
Hyderabad, First Published Jan 12, 2022, 7:52 AM IST

ఒడిశా చిత్ర పరిశ్రమకు చెందిన సీనియర్ నటుడు మిహిర్ కుమార్ దాస్ జనవరి 11 మంగళవారం కన్నుమూశారు. అనార్యోగంతో నెలరోజులుగా ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో మిహిర్ దాస్ చికిత్స తీసుకుంటున్నారు. మిహిర్ దాస్ ఏడాది కాలంగా కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతున్నారని సమాచారం. ఆయన డయాలసిస్ కోసం తరచుగా ఆసుపత్రిలో చేరుతున్నారు. మిహిర్ దాస్ కి వెంటిలేటర్ పై చికిత్స అందిస్తుండగా.. నిన్న తుదిశ్వాస విడిచారు. 

63 ఏళ్ల మిహిర్ దాస్ (Mihir Kumar Das)మరణంపై చిత్ర ప్రముఖులు, రాజకీయవేత్తలు, అభిమానులు దిగ్బ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. మిహిర్ దాస్ మరణం తీరని విషాదం... ఒడిశా చిత్ర పరిశ్రమకు పూడ్చలేని లోటు అంటూ సీఎం నవీన్ పట్నాయక్ ట్వీట్ చేశారు. ఇక ప్రధాని మోడీ సైతం మిహిర్ దాస్ మరణంపై ట్విట్టర్ వేదికగా స్పందించారు. ప్రధాన మంత్రి కార్యాలయం నుండి సందేశం విడుదల చేశారు. 

మిహిర్ దాస్ మరణవార్త కలచివేసింది. ఏళ్ల తరబడిన సాగిన ఆయన నటప్రస్థానంలో అనేక మంది హృదయాలను గెలుచుకున్నారు. ఆయన కుటుంబ సభ్యులకు, అభిమానులకు నా సంతాపం.. అంటూ ట్వీట్ చేశారు. 11 ఫిబ్రవరి 1959లో జన్మించిన మిహిర్ దాస్ నటనపై మక్కువతో పరిశ్రమకు వచ్చారు. నాలుగు దశాబ్దాల కెరీర్ లో 150కి పైగా చిత్రాలు చేశారు. విలన్, కమెడియన్, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా విభిన్న పాత్రలు చేశారు. తన అద్భుత నటనతో ప్రేక్షకులను మెప్పించి.. అనేక అవార్డులు సొంతం చేసుకున్నారు. 

మిహిర్ దాస్ ప్రముఖ సింగర్ చిత్త జేన కూతురు సంగీతను వివాహం చేసుకున్నారు. సంగీత దాస్ 2010లో మరణించారు. వీరికి అమలన్ దాస్ కుమారుడు. ఈయన ఓలివుడ్ లో హీరోగా కొనసాగుతున్నారు. 

Follow Us:
Download App:
  • android
  • ios