జీహెచ్‌ఎంసీ ఎన్నికలకు సంబంధించిన పోలింగ్‌లో హైదరాబాద్‌ ప్రజలు మందకోడిగా ఓట్‌ వేసేందుకు వస్తుంటే, సీనియర్లు, వృద్ధులు ఉత్సాహంతో ఓటు వేసేందుకు ముందుకు రావడం విశేషం. తాజాగా సీనియర్‌ నటుడు కోట శ్రీనివాసరావు ఓటు వేశారు. ఆయన ఈ వయసులో కూడా ఆయన ఓటు వేసేందుకు తన భార్యతో కలిసి రావడం విశేషం. ఓటుకు ఉన్న విలువని, దాన్ని ప్రాధాన్యతని చాటుకున్నారు. ఓటు వేసినట్టు ఆయన వేలిని కూడా చూపించడం మరో విశేషం. కోటశ్రీనివాస్‌రావు ఫిల్మ్ నగర్‌లోని ఎఫ్‌ఎన్ సీసీలో ఓటు వేశారు. 

ఇక ఇప్పటికే జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో ఇప్పటికే చిరంజీవి, నాగార్జున, విజయ్‌ దేవరకొండ ఫ్యామిలీ, బెల్లంకొండ సాయి శ్రీనివాస్‌, రాజేంద్రప్రసాద్‌ ఫ్యామిలీ, శ్యామ్‌ప్రసాద్‌ రెడ్డి, మంచు లక్ష్మీ, పరుచూరి గోపాలకృష్ణ, శ్యామ్‌ప్రసాద్‌రెడ్డి, వందేమాతరం శ్రీనివాస్‌, ఝాన్సీ వంటి వారు ఓటు హక్కుని వినియోగించుకున్నారు. తమ బాధ్యతని చాటుకున్నారు. అయితే ఓటు వేసేందుకు జనాలు పెద్దగా రాకపోవడపై రాజేంద్రప్రసాద్‌ అవేదన వ్యక్తం చేసిన విషయం తెలిసిందే.