`యాత్ర2`లో చంద్రబాబు నాయుడి పాత్రకి పాపులర్ విలన్..
ప్రస్తుతం `యాత్ర 2` సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. ఈ నేపథ్యంలో తాజాగా మరో ఆసక్తికర వార్త బయటకు వచ్చింది. ఇందులో చంద్రబాబు పాత్రలో నటించేది ఎవరనేది ఆసక్తికరంగా మారింది.

మాజీ సీఎం డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి(YSR) చేసిన పాదయాత్ర ప్రధానంగా `యాత్ర`(Yatra) చిత్రం వచ్చి మంచి ఆదరణ పొందింది. ఇప్పుడు ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేసిన ఓదార్పు యాత్ర ప్రధానంగా మరో సినిమా రాబోతుంది. `యాత్ర`కి సీక్వెల్‌గా `యాత్ర2`(Yatra2)ని రూపొందిస్తున్నారు దర్శకుడు మహి వీ రాఘవ్. ఇటీవలే ఈ సినిమా ఫస్ట్ లుక్‌ని విడుదల చేశారు. వైఎస్‌గా నటిస్తున్న మమ్ముట్టి, జగన్ పాత్రలో నటిస్తున్న ఆర్య లుక్‌లను విడుదల చేశారు. ఈ ఫస్ట్ లుక్ ఆకట్టుకుంది.
ప్రస్తుతం `యాత్ర 2` సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. ఈ నేపథ్యంలో తాజాగా మరో ఆసక్తికర వార్త బయటకు వచ్చింది. ఇందులో చంద్రబాబు (Chandrababu Naidu) పాత్రలో నటించేది ఎవరనేది ఆసక్తికరంగా మారింది. వైఎస్‌గా మమ్ముట్టి నటిస్తున్నారు. జగన్‌గా ఆర్య నటిస్తుండగా, చంద్రబాబునాయుడి పాత్ర కోసం సీనియర్ నటుడిని రంగంలోకి దించుతున్నారట. తెలుగులో అనేక సినిమాల్లో విలన్‌గా మెప్పించిన మహేష్ మంజ్రేకర్(Mahesh Manjrekar).. చంద్రబాబు నాయుడి పాత్రని పోషిస్తున్నారని చిత్ర వర్గాల నుంచి తెలుస్తున్న వార్త.
అయితే వైఎస్ రాజకీయ ప్రస్థానంలో, జగన్ పొలిటికల్ కెరీర్‌లో, ఏపీ రాజకీయాల్లో చంద్రబాబు నాయుడి పాత్ర ప్రధానంగా ఉంటుంది. టీడీపీ పార్టీ అధినేతగా, సీఎంగా పనిచేశారు. వైఎస్ చనిపోయిన తర్వాత జగన్మోహన్‌రెడ్డి జైలుకి వెళ్లే విషయంలో చంద్రబాబు నాయుడు కీలక పాత్ర పోషించారని ప్రచారం జరుగుతుంది. ఈ నేపథ్యంలో `యాత్ర2`లోనూ చంద్రబాబు నాయుడి పాత్ర ప్రధానంగా ఉండబోతుంది. అందుకే ఆ పాత్రకి ప్రముఖ నటుడు మహేష్ మంజ్రేకర్‌ని తీసుకున్నారని సమాచారం.
ఇక సినిమా షూటింగ్ విషయానికి వస్తే, ఇది నిర్విరామంగా చిత్రీకరణ జరుపుకుంటోంది. ప్రస్తుతం పులివెందులలో షూటింగ్ చేస్తున్నారు. ఫ్యామిలీకి సంబంధించిన ఎలిమెంట్లు తీస్తున్నట్టు సమాచారం. ఇప్పటి వరకు యాభై శాతం షూటింగ్ పూర్తయ్యిందని తెలుస్తుంది. ఇక ఫాస్ట్ గా సినిమాని కంప్లీట్ చేసి ఏపీ ఎన్నికలకు ముందే ఈ సినిమాని రిలీజ్ చేయాలని అనుకుంటున్నారు. వచ్చే ఏడాది ఫిబ్రవరి 8న ఈ చిత్రాన్ని రిలీజ్ చేసేందుకు దర్శకుడు మహి వీ రాఘవ్ ప్రయత్నం చేస్తున్నారు. `యాత్ర` నాలుగేళ్ల క్రితం అదే రోజు రిలీజ్ అయ్యింది. ఇప్పుడు సేమ్ డేట్‌కి సీక్వెల్‌ని కూడా విడుదల చేయబోతున్నారు.