టాలీవుడ్ లో మరో విషాదం చోటు చేసుకుంది. సీనియర్ నటుడు మన్నవ బాలయ్య (94) నేడు తుదిశ్వాస విడిచారు. కొంతకాలంగా వయసురీత్యా అనారోగ్య కారణాలతో భాదపడుతున్న ఆయన హైదరాబాద్ యూసఫ్ గూడలోని తన స్వగృహంలో తుదిశ్వాస విడిచారు.
టాలీవుడ్ లో మరో విషాదం చోటు చేసుకుంది. సీనియర్ నటుడు మన్నవ బాలయ్య (94) నేడు తుదిశ్వాస విడిచారు. కొంతకాలంగా వయసురీత్యా అనారోగ్య కారణాలతో భాదపడుతున్న ఆయన హైదరాబాద్ యూసఫ్ గూడలోని తన స్వగృహంలో తుదిశ్వాస విడిచారు. మన్మధుడు, పాండు రంగడు, మల్లీశ్వరి లాంటి చిత్రాల్లో బాలయ్య నటించారు.
1958 నుంచే చిత్ర పరిశ్రమలో ఉన్న మన్నవ బాలయ్య 300పైగా చిత్రాల్లో నటించారు. ఎత్తుకు పైఎత్తు చిత్రంతో నటుడు అయ్యారు.నిర్మాతగా, దర్శకుడుగా, కథా రచయితగా తన ప్రతిభ చూపారు. ఆయన నిర్మాతగా అమృత ఫిల్మ్స్ సంస్థ ద్వారా చెల్లెలి కాపురం, నేరము - శిక్ష, చుట్టాలున్నారు జాగ్రత్త, ఊరికిచ్చిన మాట లాంటి చిత్రాలు నిర్మించారు.
నేరము శిక్ష చిత్రానికి కళా తపస్వి కె విశ్వనాధ్ దర్శకత్వం వచించిన సంగతి తెలిసిందే. సూపర్ స్టార్ కృష్ణ ఈ చిత్రంలో హీరోగా నటించారు. మెగాస్టార్ చిరంజీవి నటించిన ఊరికిచ్చిన మాట చిత్రంలో ఉత్తమ రచయితగా నంది అవార్డు కూడా దక్కించుకున్నారు.
దర్శకుడుగా పసుపు తాడు, నిజం చెబితే నేరమా, పోలీసు అల్లుడు రూపొందించారు.చెల్లెలి కాపురం చిత్రానికి కూడా నిర్మాతగా నంది అవార్డు అందుకున్నారు. బాలయ్య కుమారుడు తులసీరామ్ కూడా కొన్ని చిత్రాల్లో కథానాయకుడిగా నటించారు.
మన్నవ బాలయ్య సతీమణి కమలాదేవి. వీరికి ముగ్గురు పిల్లలు సంతానం. ఇద్దరుకుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. మన్నవ బాలయ్య అద్భుతమైన నటుడు అని చెప్పడంలో సందేహం లేదు. బొబ్బిలి యుద్ధం, పాండవ వనవాసం, మంచి మనిషి,బాల భారతం, అల్లూరి సీతారామరాజు ఇలా ఎన్నో విజయవంతమైన చిత్రాల్లో నటించారు. మన్మధుడు చిత్రంలో నాగార్జున తాత పాత్రలో నటించారు. అలాగే మల్లీశ్వరి చిత్రంలో కూడా నటించారు.
